సోమవారం 30 నవంబర్ 2020
Warangal-rural - Sep 22, 2020 , 02:53:27

భారీగా పీడీఎస్‌ బియ్యం పట్టివేత

భారీగా పీడీఎస్‌ బియ్యం పట్టివేత

  • ఉమ్మడి జిల్లాలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల  మెరుపు దాడి
  •  కమలాపూర్‌లో 400, జఫర్‌గఢ్‌లో 170,  కురవిలో 120 క్వింటాళ్ల రైస్‌ స్వాధీనం
  • పలువురిపై కేసు, మిల్లులు, వాహనాలు సీజ్‌

కమలాపూర్‌/కురవి/జఫర్‌గఢ్‌: ఉమ్మడి జిల్లాలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మెరుపు దాడి చేసి భారీ ఎత్తున పీడీఎస్‌ బియ్యాన్ని ప ట్టుకున్నారు. కమలాపూర్‌-పంగిడిపల్లి రహదారిలో ఉన్న సాంబశివ మోడ్రన్‌ రైస్‌ మిల్లులో 400 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. రైస్‌మిల్లు యజమాని బె జ్జంకి శ్రీనివాస్‌ డబ్బు సంపాదించాలనే కక్కుర్తితో ఆసాల రవి, గందసిరి రాజు, కిన్నెర మొగిలి, బూతాల ప్రవీణ్‌తో రేషన్‌ బి య్యం కొనుగోలు చేసి మిల్లుకు చేరవేసేందుకు ఒప్పందం చేసుకున్నాడు. రవి మొగుళ్లపల్లి మండలం మెట్‌పల్లికి చెందిన రేషన్‌ డీలర్‌ శోభారాణి వద్ద 45 బస్తాల బియ్యం కొనుగోలు చేసి రైస్‌మిల్లులో దిగుమతి చేశాడు. కొంతకాలంగా రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ చేస్తూ మార్కెట్‌లో సన్నబియ్యం పేరుతో అమ్ముతున్నారు. దీంతో వీరందరితోపాటు లారీ డ్రైవర్‌ సంపత్‌పై క్రిమినల్‌ కేసుతోపాటు 6ఏ కేసు నమోదు చేసినట్లు సీఐ రవిరాజు వెల్లడించారు. రైస్‌మిల్లు, లారీ, రెండు ఆటో ట్రాలీలను సీజ్‌ చేసినట్లు జిల్లా సివి ల్‌ సప్లయ్‌ అధికారి వసంతలక్ష్మి తెలిపారు. పట్టుబడిన రేషన్‌ బియ్యం విలువ సుమారు రూ. 15 లక్షలు ఉం టుందని, వాటిని హుజూరాబాద్‌కు తరలించి తూ కం వేసి వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌లోని ఎంఎస్‌సీ పాయింట్‌కు తరలించినట్లు వెల్లడించా రు. రైస్‌మిల్లును కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్‌, తహసీల్దార్‌ జ్యోతివరలక్ష్మీదేవి, డీటీసీఎస్‌లు జ యశంకర్‌, రమేశ్‌, వంగర ఎస్సై స్వప్న, ఆర్‌ఐలు శ్రీధర్‌, మల్లయ్య పరిశీలించారు.  అదేవిధంగా కు రవి మండలంలోని రాజోలు శివారు పోలంపల్లితండా జీపీకి చెందిన బదావత్‌ శంకర్‌ కిరాణా షా పులో పోలీసులు సోమవారం దాడి చేసి 120 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని పట్టుకున్నట్లు తెలిసింది. ఆ బియ్యం సీల్‌ కూడా తీయకపోవడం గ మనార్హం. అలాగే జఫర్‌గఢ్‌ మండలంలోని సూరా రం గ్రామ శివారులోని రాజరాజేశ్వర రైస్‌ మిల్లు లో అక్రమంగా నిల్వ చేసిన 170 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు సోమవారం స్వాధీనం చేసు కున్నారు. మిల్లు యజమానులు రేవూరి రమేశ్‌, రే వూరి శ్రీనివాస్‌, రేవూరి పూర్ణచందర్‌తోపాటు మరో ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసినట్లు టా స్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ నందిరాం, మధు తెలిపారు.