బుధవారం 20 జనవరి 2021
Warangal-rural - Sep 22, 2020 , 02:53:28

పీవీ చదువుకున్న కళాశాలకు పూర్వవైభవం తీసుకువస్తాం

పీవీ చదువుకున్న కళాశాలకు పూర్వవైభవం తీసుకువస్తాం

  • ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

రెడ్డికాలనీ, సెప్టెంబర్‌ 21: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు చదు వుకున్న హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు పూర్వ వైభ వం తీసుకువస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన పల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. సోమవారం ఆయన ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి పాత, నూతనంగా నిర్మించిన జూని యర్‌ కళాశాల భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వినోద్‌కు మార్‌ మాట్లాడుతూ పీవీ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆయన స్మారకంగా కళాశాల భవనాలను పునరుద్ధరించి భావితరాల వారికి అందిస్తామన్నారు. ఇక్కడ పీవీ 1931 నుంచి 1939 వరకు విద్యాభ్యాసం చేశారని, అయితే రజాకార్ల ఉద్యమ సందర్భంలో ఆయ నను సస్పెండ్‌ చేసినట్లు వివరించారు. దీంతో నాగపూర్‌ వెళ్లి విద్యాభ్యా సం చేశారని వినోద్‌కుమార్‌ గుర్తు చేశారు. దక్షణ భారత దేశానికి చెంది న నర్సింహారావు మొదటిసారిగా ప్రధానిగా ఎన్నికై ప్రపంచస్థాయిలో పరిపాలనాధ్యక్షుడుగా పేరుగాంచారన్నారు. ఏ పదవిలో పీవీ ఉన్నా ఆ పదవికే వన్నె తెచ్చారని, ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారని వి నోద్‌కుమార్‌ అన్నారు. దాస్యం వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పాఠశాలను భావితరాలవారికి అందించా లనే ఉద్దేశంతో పాత భవనాలను పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు. 

జూనియర్‌ కళాశాల వెబ్‌సైట్‌ ఆవిష్కరణ 

హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నూతన వెబ్‌సైట్‌ను వారు ప్రారంభించారు. ఆన్‌లైన్‌లో నిర్వహించే ప్రతి క్లాసు ఈ వెబ్‌సైట్‌ లో ఏ రోజుకారోజు అందుబాటులో ఉంటుందని ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ రావు వివరించారు. కార్యక్రమంలో ఆర్జేడీ యన్యానాయక్‌, వొకేషనల్‌ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ దివాకర్‌, లైబ్రేరియన్‌ రాజేశ్వర్‌కు మా ర్‌, శ్రీనివాస్‌రెడ్డి, పరశురాములు, అధ్యాపకులు పాల్గొన్నారు.


logo