శనివారం 31 అక్టోబర్ 2020
Warangal-rural - Sep 21, 2020 , 04:36:55

జిల్లాలో మోస్తరు వర్షం

జిల్లాలో మోస్తరు వర్షం

కలెక్టరేట్‌: జిల్లాలో ఆదివారం 114.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి కొంగర శామ్యూల్‌ తెలిపారు. పరకాలలో 7.8 మి.మీ, శాయంపేటలో 1.4 మి.మీ, గీసుగొండలో 0.6 మి.మీ, దుగ్గొండిలో 3.4 మి.మీ, నల్లబెల్లి, నర్సంపేటలో 1.8 మి.మీ, ఖానాపూర్‌లో 2.2 మి.మీ, చెన్నారావుపేటలో 2.6 మి.మీ, సంగెంలో 21.2 మి.మీ, వర్ధన్నపేటలో 7.2 మి.మీ, రాయపర్తిలో 10.2 మి.మీ, పర్వతగిరిలో 18.2 మి.మీ, నెక్కొండలో 36 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించారు.