బుధవారం 25 నవంబర్ 2020
Warangal-rural - Sep 21, 2020 , 04:36:55

నేడు రాయపర్తికి మంత్రి ఎర్రబెల్లి రాక

నేడు రాయపర్తికి మంత్రి ఎర్రబెల్లి రాక

రాయపర్తి: రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం మండలకేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయానికి రానున్నట్లు ఇన్‌చార్జి తహసీల్దార్‌ ఏ వెంకట్‌భాస్కర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మునావత్‌ నర్సింహనాయక్‌, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి తెలిపారు. ఆదివారం వారు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేస్తారని చెప్పారు. ఉదయం 9 గంటలకు జరిగే కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు సకాలంలో హాజరు కావాలని వారు కోరారు. సమావేశంలో గిర్దావర్‌ మల్లయ్య, వీఆర్వోలు గొల్ల రాంచంద్రయ్య, బైరి అశోక్‌కుమార్‌, బక్కీ వెంకటేశ్వర్లు, చందర్‌, నెమ్మది వాసు, ఏకాంబ్రం, రజిత, షమీన, అరుణ్‌కుమార్‌, యాకయ్య, గోపీసింగ్‌, రజిత, సూర రాజు పాల్గొన్నారు.