శనివారం 28 నవంబర్ 2020
Warangal-rural - Sep 19, 2020 , 05:43:22

ధాన్యం ర‌వాణాకు ప‌క్కా ప్లాన్‌

ధాన్యం ర‌వాణాకు ప‌క్కా ప్లాన్‌

  • సర్కారు ముందుచూపుతో పకడ్బందీ ప్రణాళిక
  • ట్రాన్స్‌పోర్ట్‌ సెక్టార్ల పెంపునకు నిర్ణయం
  • రెండు, మూడు మండలాలతో సెక్టార్‌
  • పెరుగనున్న కాంట్రాక్టర్లు
  • టెండర్ల ప్రక్రియ చేపట్టిన పౌర సరఫరాల సంస్థ
  • రేషన్‌ డీలర్ల నుంచి గన్నీ సంచుల సేకరణ

గత యాసంగిలో అంచనాకు మించి ధాన్యం, మక్కల దిగుబడులు వచ్చినా పౌర సరఫరాల సంస్థ, మార్క్‌ఫెడ్‌ ద్వారా ప్రభుత్వం రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేపట్టింది. కాగా వాటిని రైస్‌ మిల్లులు, గోడౌన్లకు తరలించడం తలకుమించిన భారమైంది. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి ముందుచూపుతో ప్రణాళికలు సిద్ధం చేసింది. సంచులు సమకూర్చడంతో పాటు ప్రధానంగా రవాణాపై దృష్టి పెట్టింది. రేషన్‌ డీలర్ల నుంచి గన్నీ సంచులు సేకరిస్తూనే, రెండు లేదా మూడు మండలాలను ఒక సెక్టార్‌గా గుర్తించి ట్రాన్స్‌పోర్ట్‌ కోసం కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు పిలిచింది. ఇక గుత్తేదారుల సంఖ్య పెరుగనుండడంతో ధాన్యం తరలింపు ఇబ్బందులు తప్పనున్నాయి. 

- వరంగల్‌రూరల్‌, నమస్తే తెలంగాణ

వరంగల్‌రూరల్‌, నమస్తే తెలంగాణ : వర్షాలు విస్తారంగా కురవడం, కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో గత యాసంగిలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ధాన్యం, మక్కల దిగుబడి అధికంగా వచ్చింది. మద్దతు ధరతో వీటిని ప్రభుత్వమే రైతుల నుంచి పౌరసరఫరాల సంస్థ, మార్క్‌ఫెడ్‌ ద్వారా రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేసింది. తీరా వీటిని రైస్‌మిల్లులు, గోడౌన్లకు రవాణా చేయడం లో సమస్యలు తలెత్తాయి. అంచనాకు మించి దిగుబడులు రావడంతో ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టర్లకు తలకుమించిన భారమైంది. ఒకదశలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మక్కల నిల్వలు పేరుకుపోయి కొనుగోళ్లు నిలిచిపోయాయి. సమస్య పరిష్కారానికి అధికారులు అనేక మార్గాలు వెతికారు. రైతులతో మాట్లాడి అందుబాటు లో ఉన్న ట్రాక్టర్ల ద్వారా తరలించుకోవాలని రవాణా చార్జీలు చెల్లిస్తామని చెప్పారు. 
దీంతో రైతులు గ్రామాల్లో అందుబాటులో ఉన్న ట్రా క్టర్లను ఉపయోగించారు. కొందరు ట్రాక్టర్లకు అద్దె చెల్లిం చి రవాణా చేసుకున్నారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. రైతులతో కలిసి ప్రధాన రహదారులపై ఇసుక, ఇతర సరుకుల రవాణా కోసం వెళ్లే లారీ లు, వ్యాన్లు ఆపి కొనుగోలు కేంద్రాలకు మళ్లించారు. క లెక్టర్లు, అడిషనల్‌ కలెక్టర్లు, ఆర్డీవోలు సైతం రోడ్లపై నిలబడి దారిన వెళ్లే లారీలు, వ్యాన్లు, ఇతర వాహనాలు ఆ పి ధాన్యం, మక్కల రవాణాకు పంపారు. సొంత ట్రాక్ట ర్లు, అద్దె వాహనాలు సమకూర్చి ధాన్యం, మక్కలు ర వాణా చేసిన రైతులకు చార్జీలు చెల్లించారు.
ట్రాన్స్‌పోర్ట్‌ సెక్టార్ల పెంపు..
గతంలో మూడు నాలుగు మండలాలకు ఒక సెక్టార్‌ లెక్కన గుర్తించి టెండర్‌ పద్ధతిన ధాన్యం, మక్కల ట్రా న్స్‌పోర్ట్‌ కాంట్రాక్టర్లను ఖరారు చేసేవారు. దిగుబడులు ఎక్కువ రావడంతో రవాణాలో సమస్య ఉత్పన్నమైంది. మూడు నాలుగు మండలాల పంట ఉత్పత్తులను ట్రాన్స్‌పోర్ట్‌ చేయడం ఒక్క కాంట్రాక్టర్‌ వల్ల సాధ్యం కాలేదు. ఈ ఏడాది కూడా వర్షాలు విస్తారంగా కురవడం, ఎస్సారెస్పీ కాల్వల ద్వారా కాళేశ్వరం నీరు చెరువుల్లోకి రావడంతో వానకాలం సీజన్‌లో పంటల సాగు విస్తీర్ణం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో కొనుగోళ్లు, రవాణాలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తుగా సమాయత్తమవుతున్నారు. అక్టోబ ర్‌, నవంబర్‌ నుంచి కొనుగోలు చేసే ధాన్యం రవాణా కోసం ఈ సారి ట్రాన్స్‌పోర్ట్‌ సెక్టార్లు పెంచాలని నిర్ణయించి ఆయా జిల్లాల్లో చర్యలు తీసుకుంటున్నారు. వరంగల్‌రూరల్‌ జిల్లాలో గత సీజన్‌ వరకు ఐదు ట్రాన్స్‌పోర్ట్‌ సెక్టార్లు ఉంటే ఈ ఏడాది రెండు మూడు మండలాలకు ఒకటి చొప్పున ఏడు సెక్టార్లను అధికారులు గుర్తించి ప్రణాళిక రూపొందించారు. 
సెక్టార్లలో ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టర్లను ఖరారు చేసేందుకు తాజాగా పౌరసరఫరాల సంస్థ అధికారులు ఆన్‌లైన్‌ టెండర్ల ప్రక్రియ చేపట్టారు. ఈ నెల 25న టెక్నికల్‌, ఫైనాన్స్‌ బిడ్‌ ఓపెన్‌ చేయనున్నట్లు ప్రకటించారు. టెండర్లు దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు రంగంలోకి దిగగా, 25న ఎవరికి దక్కేది తేలనుంది. రూరల్‌ జిల్లాలో ఈ సీజన్‌లో రెండు లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు 50 లక్షల గన్నీ సంచులు అవసరమని, 15 లక్షల సంచులు అందుబాటులో ఉన్నాయని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ (డీఎం) భాస్కర్‌ వెల్లడించారు. 35 లక్షల సంచులను సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టారు. గత ఆగస్టు నుంచి రేషన్‌ డీలర్ల నుంచి గన్నీ సంచులు కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో సంచికి రూ.18 చెల్లిస్తున్నారు. గన్నీ సంచులను పౌరసరఫరాల సంస్థకు విక్రయించకుండా మార్కెట్‌లో అమ్మే డీలర్లపై వేటు వేయనున్నట్లు జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ మహేందర్‌రెడ్డి ప్రకటించారు.