బుధవారం 25 నవంబర్ 2020
Warangal-rural - Sep 19, 2020 , 05:43:19

గేదెల కొనుగోలుకు ఎస్సీలకు సబ్సిడీపై రుణాలు

గేదెల కొనుగోలుకు ఎస్సీలకు సబ్సిడీపై రుణాలు

నర్సంపేట, సెప్టెంబర్‌ 18 : గేదెల కొనుగోలుకు ఎస్సీలకు సబ్సిడీపై రుణాలు అందిస్తున్నామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అ న్నారు. శుక్రవారం నర్సంపేట వాసవీ క ల్యాణమండపంలో డీసీసీబీ ద్వారా రుణా ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ని యోజకవర్గంలో క్షీరవిప్లవం తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.

విజయ డెయిరీ అ నుసంధానంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టి లీటరు పాలకు అదనంగా డబ్బులిచ్చే విధంగా చూస్తున్నామన్నారు. పశువులకు సరిపడా దాణా అందిస్తామన్నారు. రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతుండడాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్‌ నర్సంపేట నియోజకవర్గానికి పాకాల, రంగాయ ప్రా జెక్టులను మంజూరు చేయించారన్నారు. కొద్దినెలలో వీటిని ప్రారంభించేందుకు సి ద్ధం అవుతున్నామని తెలిపారు. దీనివల్ల రెండు పంటలకు సమృద్ధిగా నీరందుతుందన్నారు.

రైతులకు సకాలంలో కొత్త రుణా లు అందిస్తున్నామని డీసీసీబీ చైర్మన్‌ మా ర్నేని రవీందర్‌రావు అన్నారు. మహిళా సం ఘాలు ఒక్కో గ్రూపునకు రూ. 8 లక్షలు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమం లో సొసైటీ చైర్మన్‌ మూరాల మోహన్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ చెట్టుపల్లి మురళీధర్‌, ఎంపీ పీ మోతె కళావతి, నామాల సత్యనారాయ ణ, కోమండ్ల గోపాల్‌రెడ్డి, ఈర్ల నర్సింహరాములు తదితరులు పాల్గొన్నారు.