మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Warangal-rural - Sep 16, 2020 , 05:03:47

యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి

యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి

  • అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదు
  • రూరల్‌ జిల్లా కలెక్టర్‌ హరిత
  • నల్లబెల్లిలో ప్రకృతి వనం పరిశీలన

నర్సంపేట, సెప్టెంబర్‌ 15 : అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదని, యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని వరంగల్‌ రూరల్‌ కలెక్టర్‌ హరిత అన్నారు.  మంగళవారం నల్లబెల్లి మండలంలోని నారక్కపేట, రాంపూర్‌ గ్రామాల్లోని రైతు వేదికలు విలేజ్‌పార్కులు, శ్మశాన వాటిక స్థలాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రకృతి వనాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. గ్రామగ్రామాన పార్కు లు, శ్మశాన వాటికలు, డంపింగ్‌ యార్డుల నిర్మాణాలు చేపట్టాలన్నారు.గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం వేయకుండా ఇంట్లో ఉన్న తడిపొడి చెత్త డబ్బాలను వినియోగించుకోవాలన్నారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ బతికించుకునేలా చూడాలని ప్రజలను కోరారు. ఆమె వెంట ఎంపీపీ ఊడుగుల సునీతాప్రవీణ్‌గౌడ్‌, పీఆర్‌ డీఈ ఇజ్జగిరి, ఎంపీడీవో శంకర్‌, తహసీల్దార్‌ వివేక్‌, ఏడీఏ శ్రీనివాసరావు, ఎంపీ వో ప్రకాశ్‌, ఏవో పరమేశ్వర్‌, పీఆర్‌ ఏఈ వెంకటేశ్వర్లు, సర్పంచ్‌లు వక్కాల మల్లికాంబ, చింతపట్ల సురేశ్‌, లావుడ్య తిరుపతి, ఊరటి అమరేందర్‌, ఎంపీటీసీ సభ్యులు అజ్మీరా లక్ష్మి, సౌమ్య, ఏడాకుల రవి పాల్గొన్నారు.

హరితహారం.. దేశానికి ఆదర్శం

దామెర : హరితహారం దేశానికి ఆదర్శమని ఎంపీపీ కాగితాల శంకర్‌ అన్నారు. మండలంలోని ల్యాదెళ్లలో హరితపార్కులో ఆయన మొక్క లు నాటి నీరు పోశారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ.. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిది అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కుక్క శ్రావణ్య అనిల్‌, ఎంపీడీవో వెంకటేశ్వర్‌రావు, ఎంపీవో యాదగిరి, ఏపీ వో శారద, ఉపసర్పంచ్‌ కీర్తి, మాజీ సర్పంచ్‌ హిం గె శ్రీనివాస్‌, వార్డు సభ్యులు కవితారమేశ్‌, అమ్ము ల దేవేందర్‌, శ్రీలత, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌, మాజీ వార్డు సభ్యుడు కరిగొత్త రమేశ్‌, మాజీ ఉప సర్పంచ్‌ దేవేందర్‌ పాల్గొన్నారు.

విలేజ్‌ పార్కులతో ఆనందం

 ఆత్మకూరు : విలేజ్‌ పార్కులతో ఆహ్లాదకర వాతావరణాన్ని పొందుతామని ఎంపీడీవో నర్మద అన్నారు. మండలంలోని లింగమడుగుపల్లి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న విలేజ్‌ పార్కు ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ విలేజ్‌ పార్కులో పూలు, పండ్ల మొక్కలు పెంచాలని సర్పంచ్‌, కార్యదర్శికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో ప్రభాకర్‌, ఏపీవో రాజిరెడ్డి, సర్పంచ్‌ జిల్లెల రాజేశ్వరీరాజు, కార్యదర్శి లావణ్య,సిబ్బంది పాల్గొన్నారు.

గ్రామాలకు కొత్త శోభ

వర్ధన్నపేట :  పల్లె ప్రకృతి వనాలతో గ్రామాలకు కొత్త శోభ సంతరించుకుంటున్నదని ఎంపీపీ అన్నమనేని అప్పారావు అన్నారు. మండలంలోని ల్యాబర్తి గ్రామ ప్రకృతి వనాన్ని ఎంపీపీ, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, ఎంపీడీవో పరిశీలించారు. త్వర లో మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్యే రమేశ్‌ చేతు ల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తు న్న ట్లు తెలిపారు. ఆయన వెంట ఎంపీడీవో రాజ్యలక్ష్మి, సర్పంచ్‌, ఎంపీటీసీ ఉన్నారు.logo