గురువారం 22 అక్టోబర్ 2020
Warangal-rural - Sep 16, 2020 , 05:03:47

పారిశుధ్య పనులు నిరంతరం కొనసాగించాలి

పారిశుధ్య పనులు నిరంతరం కొనసాగించాలి

గీసుగొండ, సెప్టెంబర్‌ 15 : మండలంలోని అన్ని గ్రామాల్లో పారిశుధ్య పనులను నిరంతరం కొనసాగించాలని డీఎల్పీవో ప్రభాకర్‌ సూచించారు. మంగళవారం మండలంలోని విశ్వనాథపురం, కొమ్మాల, దస్రుతండాల్లో ఎంపీవో  శేషాంజన్‌స్వామితో కలిసి ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా పారిశుధ్య నిర్వహణ, పల్లె ప్రకృతి వనాల నిర్మాణం, పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. అనధికార లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారిని ఎల్‌ఆర్‌ఎస్‌లో క్రమబద్ధీకరించుకునేలా అవగాహన కల్పించాలని కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కవిత, పంచాయతీ కార్యదర్శులు ప్రశాంత్‌, సుధాకర్‌, సిబ్బంది పాల్గొన్నారు. logo