ఆదివారం 29 నవంబర్ 2020
Warangal-rural - Sep 16, 2020 , 05:03:45

ఓటరుగా నమోదు చేసుకోవాలి

ఓటరుగా నమోదు చేసుకోవాలి

  • టీఆర్‌ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్‌ పోచంపల్లి రఘుపతి
  • 2017 కంటే ముందు డిగ్రీ పాసైన వారు అర్హులు

పరకాల, సెప్టెంబర్‌ 15 : వరంగల్‌, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక త్వరలో జరుగనున్న నేపథ్యంలో పట్టభద్రులు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని టీఆర్‌ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్‌ పోచంపల్లి రఘుపతి అన్నారు. మంగళవారం నడికూడ, పరకాల మండలకేంద్రాల్లో ఆ సంఘం నాయకులు ఓటు నమోదు ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘుపతి మాట్లాడుతూ.. 2017కంటే ముందు డిగ్రీ పూర్తిచేసిన వారు డిగ్రీ ప్రొవిజనల్‌, ఆధార్‌, ఓటరుఐడీ, రెండు పాస్‌ ఫొటోలు తీసు కొచ్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఊర రవీందర్‌రావు, టీఆర్‌ఎస్వీ నాయకులు గుడికందుల శివ, ముస్కె రాము, సురాబు శ్రీకాంత్‌, ప్రదీప్‌, సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.

రాయపర్తి : మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన పట్టభద్రులు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని సన్నూరు సర్పంచ్‌ నలమాస సారయ్య, ఎంపీటీసీ భూక్యా గోవింద్‌నాయక్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ యూత్‌ నాయకులు సత్తూరి నాగరాజు ఆధ్వర్యంలో సన్నూరు, వెంకటేశ్వరపల్లి, జయరాంతండాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటరు నమోదుపై యువతకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డిగ్రీ పూర్తి చేసిన వారు తమ పేరును నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు గూబ యాకమ్మ, టీఆర్‌ఎస్‌ నాయకులు కుందూరు శ్రీనివాస్‌రెడ్డి, కోల శ్రీకాంత్‌, దీకొండ సంపత్‌, చెడుపాక వెంకటేశ్‌, బొమ్మెర అశోక్‌కుమార్‌, శివరాత్రి అశోక్‌కుమార్‌, ఫణికుమార్‌, శ్రీను, వెంకటేశ్‌, రవీందర్‌, అశోక్‌, సోమేశ్వర్‌, గౌస్‌నాయక్‌, గూడెల్లి శ్రీనివాస్‌, మంద వెంకన్న, గొట్టం ప్రతాప్‌రెడ్డి, గూబ అశోక్‌, ఎనగందుల సామ్రాట్‌, చెరుపల్లి శ్రీనివాస్‌, గూబ మురలి, వెంకటేశ్‌, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.