శుక్రవారం 15 జనవరి 2021
Warangal-rural - Sep 09, 2020 , 04:29:22

అక్రమాల పుట్ట.. వీఆర్వోల చిట్టా

అక్రమాల పుట్ట.. వీఆర్వోల చిట్టా

  • భూ రికార్డుల్లో ట్యాంపరింగ్‌
  • ఒకరి స్థానంలో మరొకరి పేరు
  • భూమి లేకున్నా ఉన్నట్లు రికార్డులు
  • అక్రమంగా పట్టా పాస్‌బుక్‌ల జారీ
  • అన్నీ సక్రమంగా ఉన్నా డబ్బులిస్తేనే పని
  • మనస్తాపంతో ప్రాణాలొదిలిన పలువురు బాధితులు

వరంగల్‌ రూరల్‌, నమస్తేతెలంగాణ : తాజా పరిణామాల నేపథ్యంలో ప్ర ధానంగా వీఆర్వోల అక్రమాలు, వసూళ్లపై పల్లెల్లో ఆసక్తికర చర్చలు వినిపిస్తున్నాయి. వీఆర్వోల నుంచి ఇన్నాళ్లూ తాము ఎదుర్కొన్న ఇబ్బందులు, సతాయింపులను బాధితులు నెమరేసుకుంటున్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఒకరి పేరు తొలగించి మరొకరి పేరు చేర్చడం, రికార్డులను ట్యాంపరింగ్‌ చేసి ఒకరి భూమిని మరొకరి పేరిట రాయడం, రికార్డుల్లో ఉన్న పేర్లను కంప్యూటర్లలో నమోదు చేయకపోవడం, వన్‌-బీ అమలు చేయకుండా తమ చుట్టూ తిప్పుకోవడం, పట్టా పాస్‌ బుక్కులు ఇవ్వకపోవడాన్ని జనం గుర్తు చేసుకుంటున్నా రు. ఒకరి పట్టా పాస్‌ పుస్తకాలను మరొకరికి ఇవ్వడాన్ని కూడా చెప్పుకుంటున్నారు. ప్రతి పనికీ రేటు ఫిక్స్‌ చేయడం, ముడుపులు ముడితేనే పని చేసేం దు

కు ఆసక్తి చూపడం, డిమాండ్‌ మేరకు డబ్బు అందకపోతే పని వాయిదా వే యడం లాం టి లీలలను కథలుగా వినిపిస్తున్నారు. అనేక గ్రామాల్లో వీఆర్వో లు అందినకాడికి డబ్బు గుంజి అసలే భూములు లేని వ్యక్తులకు ఉన్నట్లు పట్టా పాస్‌ పుస్తకాలు అందజేశారు. వాటిని పొందిన అక్రమార్కులు రైతుబం ధు సాయంతో పాటు బ్యాంకు రుణాలు పొందుతున్నారు. పలు గ్రామాల్లో ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారులు విచారణ చేసి బాధ్యులైన వీఆర్వోలను సస్పెండ్‌ చేసిన ఉదంతాలున్నాయి. వివిధ గ్రామాల్లో రైతుల నుంచి లంచం తీసుకుంటూ పలువురు వీఆర్వోలు రెడ్‌ హ్యాండెడ్‌గా ఏబీసీకి చిక్కిన ఘటనలు కోకొల్లలు. కొందరు వీఆర్వోల సతాయింపుతో మనస్తాపం చెందిన పలువురు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. నెక్కొండ మండలం రెడ్లవాడలో

ఓ రైతు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పర్వతగిరి మండలం ఏనుగల్లులో ఓ రైతు వీఆర్వో తన వ్యవసాయ భూమికి పట్టా పాస్‌ బుక్‌ ఇ వ్వడం లేదని తాసిల్దార్‌ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇలాంటి ఘటనలతో ప్రజలు వీఆర్వోల తీరును తీవ్రంగా నిరసిస్తున్నారు. అక్రమాల పుట్ట వంటి వీఆర్వోల చిట్టాకు తెరదించడం, కొత్త రెవెన్యూ చట్టం అమలు దిశగా అడుగులు వేస్తుండడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. 

మచ్చుకు కొన్ని..

n రాయపర్తి మండలం కొండూరు వీఆర్వో ఈర్ల ఎల్లయ్య, పట్టా పాస్‌బుక్‌ 

    ఇచ్చేందుకు ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు 

    పట్టుబడ్డాడు.  

n నెక్కొండ మండలం రెడ్లవాడలో భూమి అమ్మిన రైతు పేరు తొలగించి 

   రికార్డుల్లో తన పేరు చేర్చాలని వీఆర్వో చిరుత సంపత్‌తో పాటు ఇతర 

    రెవెన్యూ అధికారులను కలిశాడు. వారు కొన్ని నెలల పాటు తిప్పుకొని పని 

    చేయకపోవడంతో మనస్తాపం చెందిన ఆ రైతు 2018లో రైలు కింద పడి 

    ఆత్మహత్య చేసుకున్నాడు.

n ఆత్మకూరు వీఆర్వో సుధీర్‌కుమార్‌ అసలే భూమి లేని తిర్మలగిరిలోని 

     ఒకరికి 4.19 ఎకరాలు ఉన్నట్లు రికార్డులు సృష్టించి పట్టాదారు పాస్‌ పుస్త

    కాలిచ్చాడు. దీంతో  పట్టా పొందిన వ్యక్తి రెండు సీజన్లలో రైతుబంధు 

    ఆర్థిక సాయం పొందాడు. ఉన్నతాధికారులు విచారణ జరిపి కొద్ది నెలల 

    క్రితం వీఆర్వోపై సస్పెన్షన్‌ వేటు వేశారు.  

n సంగెం మండలం మొండ్రాయి వీఆర్వో దేవేందర్‌ తమ వద్ద డబ్బు 

    తీసుకొని పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇవ్వడం లేదని స్థానిక రైతులు అప్పటి 

   జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా కొద్ది నెలల క్రితం వీఆర్వోపై 

    సస్పెన్షన్‌ వేటు పడింది.

n శాయంపేట మండలం కాట్రపల్లిలో ప్రభుత్వం దళితుల కోసం భూమి 

    కొనుగోలు చేసింది. విక్రయించిన రైతులు, లబ్ధిదారుల నుంచి వీఆర్వో, 

    రెవెన్యూ, ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు డబ్బు వసూలు చేశారనే 

    ఆరోపణలు వచ్చాయి. లంచం తీసుకుంటుండగా కాట్రపల్లి వీఆర్వో 

    సమ్మయ్య, ఎస్సీ కార్పొరేషన్‌ ఉద్యోగి ఏసీబీకి దొరికారు.  

n దామెర మండలం ఊరుగొండ వీఆర్వో శ్రీనివాస్‌, తక్కళ్లపాడు వీఆర్వో 

    శైలజ పైనా వివిధ ఆరోపణ నేపథ్యంలో సస్పెన్షన్‌ వేటు వేస్తూ కలెక్టర్‌ 

    ఉత్తర్వులు జారీ చేశారు.