శనివారం 23 జనవరి 2021
Warangal-rural - Sep 04, 2020 , 06:07:44

గడపగడపకూ సంక్షేమ పథకం

గడపగడపకూ సంక్షేమ పథకం

ఎమ్మెల్యే అరూరి రమేశ్‌

వర్ధన్నపేట, సెప్టెంబర్‌ 3 : గడపగడపకూ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అన్నారు. మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం 20 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.20,02,320 చెక్కులు, 29 మంది సీఎంఆర్‌ఎఫ్‌ లబ్ధిదారులకు రూ.8,92,500 చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు అందాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు రూపొందిస్తున్నారన్నారు. పథకాలను లబ్ధిదారులకు సక్రమంగా అందేలా పార్టీ శ్రేణులు, అధికారులు కృషి చేయాలని కోరారు.కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అరుణ, వైస్‌ చైర్మన్‌ ఎలేందర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ చొప్పరి సోమలక్ష్మి, తహసీల్దార్‌ భాస్కర్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు,పాల్గొన్నారు.logo