సోమవారం 23 నవంబర్ 2020
Warangal-rural - Sep 04, 2020 , 06:07:44

త్వరలో నూతన రెవెన్యూ చట్టం

త్వరలో నూతన రెవెన్యూ చట్టం

  • పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీలో 
  • ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
  • ‘రైతుబీమా’ను అభినందించిన ప్రధాని 
  • దసరా నాటికి రైతువేదికలు సిద్ధం

పరకాల, సెప్టెంబర్‌ 3 : త్వరలో జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకురానున్నదని పరకాల ఎమ్మె ల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం పరకాల ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో కిషన్‌ అధ్యక్షతన పరకాల, నడికూడ, ఆత్మకూరు, దామెర మండలాలకు చెందిన 170 మంది రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే చల్లా హాజరై మాట్లా డారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేలా సీఎం కేసీఆర్‌ ప్రణాళిక రూపొందించి కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేశారన్నారు. 60ఏళ్ల క్రితం జరిగిన సర్వే తర్వాత రైతులకు భూసమస్యలు అధికమయ్యాయని గుర్తించిన సీఎం కేసీఆర్‌ సమగ్ర భూసర్వే చేపట్టారన్నారు.

పరకాల డివిజన్‌ పరిధిలో ఇప్పటికే 95శాతం పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేసినట్లు చెప్పారు.  పాస్‌పుస్తకాలు వచ్చిన వారికే రైతుబంధు అమలుకానుండగా పాస్‌పుస్తకాల జారీలో ఆలస్యాన్ని గుర్తించి పాస్‌పుస్తకం రాకముందే ఈ ఏడాది రైతులకు సీఎం కేసీఆర్‌ ‘రైతుబంధు’ను వర్తింపజేశారన్నారు. పంట చేతికొచ్చే సమయంలో కరోనా వచ్చిందని, రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పంటలు కొనుగోలు చేసి ఆదుకున్నారని గుర్తు చేశారు. పంట పెట్టుబడికి రైతులు పడుతున్న ఇబ్బందిని గుర్తించిన సీఎం ఎకరాకు రూ.10వేలు పెట్టుబడి సాయం అందజేస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలు రైతు మరణిస్తే వర్తించే ఆపద్బంధు పథకానికి అనేక అడ్డంకులు సృష్టించేవారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం పట్టాదారు పాస్‌పుస్తకం కలిగిన ప్రతి రైతుకూ రైతుబీమాలో రూ.5లక్షలు అందజేస్తున్నట్లు తెలిపారు. అడిషనల్‌ కలెక్టర్‌ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎల్‌పీఎస్‌ స్కీంలో ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రభుత్వం భూమి కొనిచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. పరకాల, నడికూడ మండలాల్లో 50 ఎకరాల భూమి సేకరించినట్లు తెలిపారు. అనంతరం పరకాల మున్సిపాలిటీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కౌన్సిలర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తిచేయాలన్నారు.

మున్సిపాలిటీ జవాన్‌ రాజుపై మహిళా కార్మికులు ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే జవాన్‌ను విధుల నుంచి తొలగించాలని కమిషనర్‌ను ఆదేశించారు.  అక్కడి నుంచి 18వ వార్డు కౌన్సిల ర్‌ ఏకు రాజు ఇంటికి వెళ్లి ఆయనను ఎమ్మెల్యే పరామర్శించారు. ఇటీవలే రాజు తండ్రి పోచయ్య మృతి చెందగా మృతుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సోదా అనిత రామకృష్ణ, వైస్‌ చైర్మన్‌ రేగూరి విజయ పాల్‌రెడ్డి, కౌన్సిలర్లు సంపత్‌, సంతోష్‌, సారయ్య, ఎంపీపీలు స్వర్ణలత, శంకర్‌, జడ్పీటీసీ మొగిళి, తహసీల్దార్లు విశ్వనారాయణ, రజిని, రాజ్‌కుమార్‌, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌ బొల్లె భిక్షపతి, పరకాల ఏఎంసీ చైర్మన్‌ బొజ్జం రమేశ్‌, సర్పంచ్‌లు పాల్గొన్నారు.