శనివారం 16 జనవరి 2021
Warangal-rural - Sep 02, 2020 , 02:48:56

సువర్ణావకాశం

సువర్ణావకాశం

ప్రణాళికాబద్ధమైన ప్రగతి సాధనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు సహా పంచాయతీల్లో ఇక నుంచి భూముల క్రయ, విక్రయాలన్నీ సక్రమమార్గంలో నడవాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నది. భూ కొనుగోలుదారులకు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో మరోసారి ఎల్‌ఆర్‌ఎస్‌ (లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం)కు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్‌ 15దాకా గడువు ఇవ్వగా, విచ్చలవిడి అనధికార లే అవుట్లకు చెక్‌ పెట్టే దిశగా సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లయింది.   

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: విచ్చలవిడిగా పెరిగి పోతున్న అనధికార లేఅవుట్లకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.  ఇప్పటికే క్రమబద్ధీకరణ లేని భూములకు రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ స్పష్టమైన ఆదేశా లు  జారీ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే  మరోమారు ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్ల తర్వాత ప్రభుత్వం భూము ల క్రమబద్ధీకరణకు చాన్స్‌ ఇచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆగస్టు 26వ తేదీ లోపు రిజిస్ట్రేషన్లు అయిన భూములకే అవకాశం కల్పించిం ది. వచ్చే నెల 15 వరకు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొం ది. అయితే ఎల్‌ఆర్‌ఎస్‌ కింద తమ భూములను క్రమబద్ధీ కరించేందుకు గతంలో ఉన్న రూ. పదివేల రుసుమును రూ. వెయ్యి తగ్గించడం విశేషం. వచ్చే సంవత్సరం జనవరి 31 నాటికి  దరఖాస్తులన్నింటినీ పరిశీలించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు, జీపీలకు ఆదేశాలు జారీ చేసింది. 

ఐదేళ్ల తర్వాత

2015 అక్టోబర్‌ 28 వరకు ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఆర్‌కు అవ కాశం ఇచ్చింది. అప్పటి నుంచి మళ్లీ ఇప్పుడు గ్రీన్‌సిగ్నల్‌ ఇ చ్చింది. ఈ ప్రక్రియను అంతా పారదర్శకంగా చేసుకునేలా అవకాశం కల్పించింది. రూ. వెయ్యి చెల్లించి దరఖాస్తులు చేసుకోవాలి. అయితే  2015లో ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం ఇ వ్వడంతో దాదాపు 30వేల దరఖాస్తులు కాకతీయ పట్టణాభి వృద్ధి సంస్థ (కుడా)కు వచ్చాయి. వీటిలో కుడా అధికారులు  20 వేలు దరఖాస్తులను  క్రమబద్ధీకరించారు. మరో 10 వేల పెండింగ్‌లో ఉన్నాయి.  గతంలో లాంఛనాలు పూర్తి చేయని వారు కూడా తాజాగా ఎల్‌ఆర్‌ఎస్‌ కింద దరఖాస్తు చేసుకో వాలని కుడా వర్గాలు పేర్కొనడం గమనార్హం. 

అనధికార లే అవుట్లకు చెక్‌

పూర్తిగా లేఅవుట్‌ ఉన్న వాటికే ఇక నుంచి రిజిస్ట్రేషన్లు అవు తాయి. ఇప్పటి వరకు విచ్చలవిడిగా రియల్టర్లు అనధికార లే అవుట్లతో వెంచర్లు చేసి ప్లాట్ల విక్రయాలు చేసి చేతులు దులు పుకున్నారు. లేఅవుట్‌లేని భూములకు రిజిస్ట్రేషన్‌ నిలిపివే యడంతో ఇక అనధికార లేఅవుట్లకు చెక్‌ పడింది. అయితే అనధికార లే-అవుట్లలో మిగిలిన ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తిం పజేస్తూ అవకాశం కల్పించడం విశేషం. ఇప్పటి దాకా నిబం ధనలకు విరుద్ధంగా లేఅవుట్‌ చేసిన యజమానులు దరఖా స్తు చేసుకోవచ్చు. రూ. పది వేలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించడం గమనార్హం. 

అపూర్వ అవకాశం..

గతంలో దరఖాస్తు చేసుకొని అవకాశాన్ని జార విడుచుకున్న వారు, కొత్తగా తమ భూములు క్రమబద్ధీకరించుకోవాలనే వారికి ఇది అపూర్వ అవకాశమని కుడా అధికారులు పేర్కొం టున్నారు. ఉమ్మడి జిల్లాలోని దీన్ని సద్వినియోగం చేసుకునే వారి సంఖ్య లక్ష పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, జనగామ జిల్లాల పరిధిలోని 19 మండలాల్లో, 181 గ్రామాల్లో విస్తరించిన కుడాకు ఎల్‌ఆర్‌ ఎస్‌ కోసం దాదాపు లక్ష వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని కుడా ప్రాజెక్టు అధికారి అజిత్‌రెడ్డి పేర్కొన్నారు.