సోమవారం 30 నవంబర్ 2020
Warangal-rural - Sep 01, 2020 , 04:01:23

అపర భగీరథుడు సీఎం కేసీఆర్‌

అపర భగీరథుడు సీఎం కేసీఆర్‌

  • ‘మిషన్‌భగీరథ’తో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
  • సింగరాజుపల్లి ఫిల్టర్‌బెడ్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే చల్లా

దామెర, ఆగస్టు 31 : తాగునీటి సమస్యను మిషన్‌భగీరథతో శాశ్వతంగా పరిష్కరించి సీఎం కేసీఆర్‌ అపరభగీరథుడిగా నిలిచారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా దామెర మండలం సింగరాజుపల్లిలోని మిషన్‌భగీరథ ఫిల్టర్‌బెడ్‌ను సోమవారం ఆయన సందర్శించారు. పరకాల సెగ్మెంట్‌లోని అన్ని  గ్రామాలకు ఢీ ఫ్లోరైడ్‌ నీరు సరఫరా అవుతున్నదా.. ? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రగిరి చెన్నకేశవస్వామి గుట్టపై ఉన్న ట్యాంకు నుంచి ఆలయం వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు.

ఫిల్టర్‌బెడ్‌ నుంచి పరకాల నియోజకవర్గంలోని 163 ఆవాసాలకు, పరకాల మున్సిపాలిటికీ ఢీ ఫ్లోరైడ్‌ నీటిని సరఫరా చేస్తున్నట్లు ఆయన చెప్పారు. చంద్రగిరి గుట్టల్లో కొలువైన చెన్నకేశవస్వామి విశిష్టతను సీఎం కేసీఆర్‌కు వివరించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, మిషన్‌భగీరథ ఎస్‌ఈ, ఈఈ, డీఈ, ఏఈలు పాల్గొన్నారు.