శుక్రవారం 04 డిసెంబర్ 2020
Warangal-rural - Aug 30, 2020 , 03:58:24

సమయం దాటితే మిస్సే..!

సమయం దాటితే మిస్సే..!

నర్సంపేట: ఆన్‌లైన్‌ విద్యా బోధనపై ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి విద్యార్థులకు వివరిస్తున్నారు. ఇంట్లోనే టీశాట్‌లో ప్రసారమయ్యే పాఠ్యాంశాలను వినాలని కోరుతున్నారు. అందుకు తగినట్లు విద్యార్థులకు వర్క్‌షీట్లు కూడా అందజేసే పనిలో శనివారం ఉపాధ్యాయులు నిమగ్నమయ్యారు. 1, 2 తరగతులకు ఉదయం 11 నుంచి 12 గంటల వరకు, 3, 4, 5 తరగతులకు మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు, ఆరు, ఏడు తరగతులకు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, 8, 9 తరగతులకు మధ్యాహ్నం 3 గంటల నుంచి నాలుగు గంటల వరకు, పదో తరగతి విద్యార్థులకు ఉదయం పది నుంచి 11 గంటలకు, సాయంత్రం 4 నుంచి 5 గంటలకు పాఠాలు వస్తాయని టీచర్లు వివరించారు. సన్‌ డైరెక్ట్‌ 188, టాటాస్కైలో 1499, ఎయిర్‌టెల్‌లో 946, డిష్‌టీవీలో 1627, వీడియోకాన్‌లో 702, సిటీడిష్‌లో 25, ఫ్రీడిష్‌లో 45, హాత్‌వేలో 719 చానల్‌లో కేటాయించిన సమయాల్లో ఈ పాఠాలు తప్పకుండా వినాలని విద్యార్థులను కోరుతున్నారు.  విద్యార్థులు జాగ్రత్తగా పాఠాలు వీక్షించి ఎఫ్‌ఏ, ఎస్‌ఏ పరీక్షలను రాయాల్సి ఉంటుందన్నారు.