ఇవి అటు.. అవి ఇటు

n రేషన్ రైస్.. రీసైక్లింగ్
n అగ్గువకు బియ్యం సేకరించి గోదాముల్లో నిల్వ
n మరాడించి సీఎంఆర్ కింద డెలివరీ
n సర్కారు కేటాయించిన ధాన్యం ఓపెన్ మార్కెట్లో అమ్మకం
n కొందరు రైస్‌మిల్లర్ల దర్జా దందా
n టాస్క్‌ఫోర్స్ దాడులతో మరోసారి గుట్టురట్టు
కొందరు రైస్ మిల్లర్లు బరితెగిస్తున్నారు. అగ్గువకు పీడీఎస్ రైస్ సేకరించి, మరాడించి సీఎంఆర్ (కస్టం మిల్డ్ రైస్) కింద డెలివరీ చేస్తున్నారు. ప్రభుత్వం కేటాయిస్తున్న ధాన్యాన్ని దర్జాగా మార్కెట్‌కు తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలోని ఓ రైస్‌మిల్లులో పౌర సరఫరాల శాఖ స్టేట్ టాస్క్‌ఫోర్స్ అధికారులు ఈ నెల 25న తనిఖీ చేసి 92క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. దీంతో ఈ దందా గుట్టు మరోసారి రట్టవగా రైస్ ఇండస్ట్రీస్‌లో చెవులు కొరుక్కుంటున్నారు.
వరంగల్ రూరల్, నమస్తేతెలంగాణ: జిల్లాలోని కొందరు రైస్‌మిల్లర్లు పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్నారు. రేషన్ డీలర్లతో కుమ్మక్కై అగ్గువకు ప్రజా పంపిణీ బియ్యాన్ని సేక రించి గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. వాటిని మరాడించి కష్టం మిల్లింగ్ రైస్ కింద ప్రభుత్వానికి డెలివరీ చేస్తున్నారు. సీఎంఆర్ కింద సర్కారు వారికి కేటాయించిన బియ్యాన్ని ముందుగానే ఓపెన్ మార్కెట్లో యథేచ్ఛగా అమ్ముకుంటు న్నారు. తద్వారా రీసైక్లింగ్ దందాతో భారీగా లాభాలు గడిస్తున్నారు.
పీడీఎస్ రైస్ కొనుగోలు
2019-20లో వానకాలం, యాసంగి సీజన్లో ప్రభు త్వం రైతులకు రూ.1,835, రూ.1.815 మద్దతు ధర చెల్లిం చి ధాన్యం కొని సీఎంఆర్ విధానంపై రైస్‌మిల్లర్లకు కేటాయిం చింది. దీన్ని రైస్‌మిల్లర్లు మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి డెలివరీ చేస్తే చార్జీలు ఇస్తుంది. క్వింటాల్ ధాన్యానికి రా రైస్‌మిల్లర్ 67, బాయిల్డ్ రైస్‌మిల్లర్ 68 కిలోల లెక్కన బియ్యాన్ని సీఎం ఆర్ డెలివరీ ఇవ్వాల్సి ఉంది. రైస్‌మిల్లర్లు కొందరు స్థానికంగా పీడీఎస్ రైస్ సేకరించి రీసైక్లింగ్‌కు పాల్పడుతున్నారు. వీరికి చౌక డిపోల డీలర్లు పలువురు సహకరిస్తున్నారు. సదరు డీల ర్లు నేరుగా పీడీఎస్ రైస్‌ను ఆటోలు, టాటాఏస్‌ల ద్వారా రైస్ మిల్లర్ల గోదాములకు పంపుతున్నారు. ఈ బియ్యానికి మిల్ల ర్లు కిలోకు రూ.8 నుంచి రూ.12 వరకు చెల్లిస్తున్నారు. ఇలా 67 కిలోల పీడీఎస్ రైస్‌కు రా రైస్‌మిల్లర్లు రూ.536 నుంచి రూ. 804 వరకు వెచ్చిస్తున్నారు. ఈ రైస్‌ను రీసైక్లింగ్ చేసి సీఎంఆర్ కింద డెలివరీ చేస్తున్నారు. ప్రభుత్వం కేటాయించి న ధా న్యాన్ని క్వింటాల్‌కు రూ.1,800కు పైగా మార్కెట్లో విక్రయి స్తున్నారు. తద్వారా రీసైక్లింగ్ దందాతో క్వింటాల్‌కు నూరు శాతానికిపైగా లాభం గడిస్తున్నారు. రా రైస్‌మిల్లర్లతో పాటు పలువురు బాయిల్డ్ రైస్మిల్లర్లదీ ఇదే పరిస్థితి.
ముందుగానే ధాన్యం అమ్మకం
రీసైక్లింగ్ దందా చేస్తున్న రైస్‌మిల్లర్లలో పలువురు సీఎం ఆర్ డెలివరీ చేయడానికి ముందే ప్రభుత్వం తమకు కేటా యించిన ధాన్యాన్ని మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఆ తర్వా త తాపీగా పీడీఎస్ రైస్ కొని రీసైక్లింగ్ చేసి ప్రభుత్వానికి సీఎంఆర్ కింద డెలివరీ చేస్తున్నారు. వానకాలం సీజన్లో కేటాయించిన ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ డెలివరీ పూర్తికాకముందే యాసంగి సీజన్ ధాన్యం రైస్‌మిల్లులకు చేరుతుండడం, మిల్లుల్లో ధాన్యం బస్తాలను లెక్కించలేని పరి స్థితి తలెత్తుతుండటం రైస్‌మిల్లర్ల రీసైక్లింగ్ దందాకు కలిసొస్తు న్నది. దీనికితోడు రైస్‌మిల్లర్లకు ప్రభుత్వం కేటాయించిన ధా న్యంపై నిఘా పెట్టాల్సిన పౌరసరఫరాల శాఖలోని కొందరు అధికారులు కూడా అక్రమార్కులకు తమ వంతు సహకా రం అందిస్తున్నారు. తాజాగా వరంగల్ రూరల్ జిల్లాలోని పర్వతగిరి మండలంలో ఇది మరోసారి రుజువైంది. ఇక్కడ మంగళవారం ఓ రైస్‌మిల్లులో పౌరసరఫరాల శాఖలోని స్టేట్ టాస్క్ఫోర్సు అధికారులు తమకు అందిన సమాచారం మేర కు తనిఖీలు జరిపారు. రైస్‌మిల్లు పక్కన ఉన్న ఓ గోదాము లో 92 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ పట్టుకుని సీజ్ చేశారు. ఇవి రైస్‌మిల్లు యజమాని నిల్వ చేసినవేనని, రీసైక్లింగ్ కోసం అత ను వీటిని స్థానికంగా కొని గోదాములో నిల్వ చేశాడని టాస్క్ ఫోర్సు అధికారి లక్ష్మారెడ్డి ప్రకటించారు. ఆటోలు, టాటా ఏస్‌ల ద్వారా పీడీఎస్ రైస్ సదరు మిల్లుకు చేరుతున్నాయని, వరంగల్ రూరల్ జిల్లాలోని పలు రైస్‌మిల్లుల్లో ఇలాగే పీడీఎ స్ రైస్ రీసైక్లింగ్ జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన మీడియాకు చెప్పారు. గోదాము పక్కన ఉన్న రైస్‌మి ల్లులో ప్రభుత్వం కేటాయించిన ధాన్యం నిల్వల్లోనూ తేడా ఉన్నట్లు తెలిపారు. స్థానిక అధికారులు కూడా రీసైక్లింగ్ దందాపై చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని తేలింది.
హాట్‌టాపిక్
పట్టుబడిన పీడీఎస్ రైస్ నిల్వ ఉన్న గోదాము తనది కా దని పక్కన ఉన్న రైస్‌మిల్లర్ కొత్త వాదన తెరపైకి తెచ్చాడు. దీంతో పౌరసరఫరాలశాఖ అధికారులు గురువారం పర్వత గిరి పోలీసులను ఆశ్రయించారు. టాస్క్ఫోర్సు అధికారులు మాత్రం ఈ గోదాము రైస్మిల్లర్దేనని, దీనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. కేసు నుంచి బయట పడేందుకు మిల్లర్ కొత్త వాదన తెరపైకి తెచ్చాడని అంటున్నా రు. ఈ నేపథ్యంలో విచారణ జరిపి గోదాము ఎవరిదో తేల్చా లని పోలీసులను కోరినట్లు డీటీసీ ఎస్ సంధ్య చెప్పారు. ఈ పరిణామాలపై రైస్ ఇండస్ట్రీస్‌లో హాట్‌టాపిక్ నడుస్తోంది.
తాజావార్తలు
- ఢిల్లీలో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు.. ఎవరు వాళ్లు?
- వ్యాక్సిన్ తీసుకున్న ఆశావర్కర్ మృతి
- పటాన్చెరులో ఏటీఎం చోరీకి విఫలయత్నం
- నేను ఐశ్వర్యరాయ్ కుర్రాడినంటూ ఓ వ్యక్తి హల్ చల్
- అదుపు తప్పి బోల్తా పడ్డ లారీ.. ఇద్దరు మృతి
- దేశంలో కొత్తగా 14 వేల కరోనా కేసులు
- దేశంలో కోల్డ్‌వేవ్ పరిస్థితులు
- మాల్దీవులలో మాస్త్ ఎంజాయ్ చేస్తున్న మంచు లక్ష్మీ ఫ్యామిలీ
- ఘనంగా నటుడు శోభన్ బాబు జయంతి
- కథ డిమాండ్ చేస్తే గ్లామర్ షోకు రెడీ అంటున్న ప్రియమణి