సోమవారం 30 నవంబర్ 2020
Warangal-rural - Aug 28, 2020 , 04:46:35

వరద బాధితులను ఆదుకోవాలి

వరద బాధితులను ఆదుకోవాలి

  • నష్టం అంచనాలు తెప్పించుకోండి 
  • తక్షణ సాయం, శాశ్వత పరిష్కారానికి సహకరించండి
  • సర్కారు దవాఖానల్లో కరోనా వార్డులకు  మరిన్ని నిధులు కేటాయించండి
  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కోరిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు 

వరంగల్‌ ప్రతినిధి, నమస్తేతెలంగాణ: వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో వరద బాధితులను ఆదుకో వాలని, కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఎర్రబె ల్లి దయాకర్‌రావు కోరారు. గురువారం  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో మంత్రి భేటీ అయ్యారు. వరంగల్‌ వరద, ముంపు, తెగిన చెరువులు, రోడ్లు, కూలిన ఇండ్లు, పంటల నష్టాలు, కరోనా కట్టడి చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. వరంగల్‌ మహానగరం లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని సీఎస్‌కు తెలిపారు.  తాను, మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, సత్యవతిరాథోడ్‌, చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయా ప్రాంతాల్లో పరిశీలించినట్లు చెప్పారు.

నాలాలు కబ్జాలకు గురైనందున వరదలు, ముంపు ఏర్పడుతున్న ట్లుగా ప్రజలు తన క్షేత్రపర్యటనలో పేర్కొన్న విషయాన్ని మంత్రి సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లారు.  మరో వైపు  ములుగు, భూపాలపల్లి జిల్లాలో గోదావరి ఉధృతి, వాగులు వంకలు పొంగిపొర్లి అనేక విధాలుగా నష్టాలు సంభవించినట్లు మంత్రి సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లా రు. కొన్ని చెరువులు తెగిపోయాయని, అనేక చోట్ల రోడ్లు తెగి రాకపోకలకు అంతరాయం ఏర్పడిందన్నా రు. కొన్ని ఇండ్లు  కూలిపోయాయని, పత్తి, కంది, వరి పంటలు నీటమునిగి రైతాంగానికి నష్టం వాటిల్లిందని మంత్రి సీఎస్‌కు వివరించారు. నష్టపోయిన వారికి పరిహారం అందజేసేందుకు కృషి చేయాలని కోరారు. వరంగల్‌ నగరానికి వరదలు, ముంపు నుంచి శాశ్వత పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక  కరోనా కట్టడి కోసం ప్రభుత్వ దవాఖానాలకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు మరిన్ని నిధులు మంజూరు చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.