బుధవారం 27 జనవరి 2021
Warangal-rural - Aug 22, 2020 , 03:51:16

ఎన్‌హెచ్‌లపై కొత్త వంతెనలు

ఎన్‌హెచ్‌లపై కొత్త వంతెనలు

  • రెండు జాతీయ రహదారులపై తాజాగా ప్రతిపాదనలు 
  • 563లో సంగెపు వాగుపై 80 మీటర్ల పొడవు బ్రిడ్జి
  •  రూ. 3 కోట్ల అంచనాలతో  ప్రభుత్వానికి నివేదిక
  • రూ. 50 లక్షలతో తాత్కాలిక పనులు ప్రారంభం
  • 163లో కటాక్షపూర్‌ వద్ద నాలుగు లేన్ల వంతెన
  • సిద్ధమవుతున్న డీపీఆర్‌

వరంగల్‌ రూరల్‌, నమస్తే తెలంగాణ: జాతీయ రహదారులపై కొత్త వంతెనలు రాబోతున్నాయి. రెండు ఎన్‌హెచ్‌లలో వాగులపై ప్రస్తుతమున్న వంతెనల స్థానంలో కొత్తవి నిర్మించాలని తాజాగా ఇంజినీర్లు ప్రతిపాదించారు. అంచనాలు తయా రు చేసే పనిలో ఉన్నారు. వరంగల్‌-ఖమ్మం 563 ఎన్‌హెచ్‌లో వర్ధన్నపేట వద్ద సంగెం వాగుపై ఉన్న వంతెన అప్రోచ్‌రోడ్డు గురువారం రాత్రి వరద ఉధృతికి 30 మీటర్ల పొడవున కొట్టుకుపోయింది. భారీ వర్షంతో వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో ని కోనారెడ్డి చెరువుకు గండి పడడంతో సంగెపు వాగులో ఉధృతి పెరిగి అప్రోచ్‌ రోడ్డు కోతకు గు రైంది. ఫలితంగా వరంగల్‌-ఖమ్మం ఎన్‌హెచ్‌లో గురువారం రాత్రి నుంచి రాకపోకలు నిలిచిపో యాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంగెపు వాగు వంతెన వద్ద తెగిన అప్రోచ్‌ రోడ్డును పరిశీ లించి రాకపోకల పునరుద్ధరణకు వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శుక్రవా రం వద్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ ఎన్‌హెచ్‌ వరంగల్‌ డివిజన్‌ ఈఈ వెంకటేశ్వర్లు, ఇతర ఇం జినీర్లతో కలిసి సంగెపువాగు వంతెనను సందర్శిం చారు. తాత్కాలిక మరమ్మతులు చేపట్టడంతో పా టు, కొత్త వంతెన నిర్మాణం కోసం పరిశీలించారు.

రూ. 3 కోట్లతో అంచనాలు

సంగెపు వాగుపై రాకపోకల పునరుద్ధరణకు తాత్కాలికంగా చేపట్టాల్సిన పనులు, కొత్త వంతెన కోసం ఎన్‌హెచ్‌ ఇంజినీర్లు ప్రాథమికంగా అంచ నాలు వేసి ప్రభుత్వానికి నివేదించారు. 24 గంట ల్లో రాకపోకల పునరుద్ధరణకు చేపట్టాల్సిన పనుల కోసం రూ.50 లక్షలు అవసరమని నివేదికలో పే ర్కొన్నారు. ప్రస్తుత వంతెన 7 మీటర్ల ఎత్తు, 50 మీటర్ల పొడవుతో ఉంది. వరద ఉధృతిని అంచనా వేసిన ఇంజినీర్లు మొత్తం 80 మీటర్ల పొడవుతో కొత్త వంతెన నిర్మించాలని, దీనికోసం రూ.3కోట్లు అవసరమని నివేదికలో పేర్కొన్నారు. గురువారం సాయంత్రం 4 గంటల నుంచి తాత్కాలిక పనులు ప్రారంభించామని, శనివారం సాయంత్రం వరకు పూర్తి చేస్తామని ఎన్‌హెచ్‌ ఈఈ వెంకటేశ్వర్లు చె ప్పారు. శనివారం సాయంత్రం నుంచి రాకపోక లు తిరిగి ప్రారంభమవుతాయన్నారు.  

163లో కటాక్షపూర్‌ వద్ద..

హైదరాబాద్‌-భూపాలపట్నం 163వ జాతీ య రహదారిలో ఆత్మకూరు మండలం కటాక్షపూ ర్‌ వద్ద వంతెన మీదుగా చెరువు మత్తడి నీరు ప్రవ హిస్తున్నది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తో కొద్ది రోజుల నుంచి ఈ రహదారిలో వరంగ ల్‌-ములుగు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలు కురిసిన ప్రతి సారీ ఇక్కడ ఇదే పరిస్థితి తలెత్తుతోంది. కటాక్షపూర్‌ వద్ద 163 ఎన్‌హెచ్‌పై లోలెవల్‌ వంతెన ఉండడమే ఇందుకు కారణం. నాలుగు రోజుల క్రితం పరకాల ఎమ్మెల్యే చల్లా ధ ర్మారెడ్డి కటాక్షపూర్‌ చెరువు మత్తడి ఉధృతిని పరి శీలించారు. ఇక్కడ హైలెవల్‌ వంతెన నిర్మించడం పై ఎన్‌హెచ్‌ అధికారులతో చర్చించారు. అంతకు ముందు కూడా ఈ అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చివరకు ఎన్‌హెచ్‌ ఇంజినీర్లు నాలుగు లేన్లతో హైలెవెల్‌ వంతెన నిర్మాణం కోసం ప్రభు త్వానికి ప్రతిపాదించారు. సానుకూల స్పందన రా వడంతో ఈ మేరకు డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నారు. సోమవారం వరకు డిటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌ తమ చేతికందనుందని ఎన్‌హెచ్‌ వరంగల్‌ ఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆ తర్వాత టెండర్లు నిర్వ హించి హైలెవల్‌ వంతెన పనులు చేపడతామన్నా రు. గూడెప్పాడ్‌-సిరోంచ 353సీ ఎన్‌హెచ్‌లో పరకాల చలివాగు వంతెన వద్ద కొద్ది రోజుల క్రితం వరదలతో దెబ్బతిన్న రోడ్డు మరమ్మతుల కోసం రూ. 10 లక్షలతో అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపినట్లు వివరించారు. logo