మంగళవారం 19 జనవరి 2021
Warangal-rural - Aug 17, 2020 , 01:31:52

వ‌ద‌ల‌ని వాన‌

వ‌ద‌ల‌ని వాన‌

పొంగిపొర్లుతున్న చెరువులు, వాగులు

నీట మునిగిన పలు గ్రామాలు

అంతకంతకూ పెరుగుతున్న గోదావరి వరద

తీర ప్రాంత ప్రజలను తరలిస్తున్న అధికారఏజెన్సీ గ్రామాల్లో రాకపోకలు బంద్‌

పలుచోట్ల కూలిన పెంకుటిళ్లు

వరంగల్‌లో జల దిగ్బంధంలోనే పలు కాలనీలు

నమస్తే నెట్‌వర్క్‌ : వర్షాలతో వరంగల్‌ ఉమ్మడి జిల్లా అతలాకుతలం అవుతున్నది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నా యి. దీంతో ఏజెన్సీలో రాకపోకలు బంద్‌ అయ్యాయి. పలు గ్రా మాలు నీట మునగడంతో అధికారులు హుటాహుటిన ముంపు బాధితులను శిబిరాలకు తరలిస్తున్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు.. సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యేలు, అధికార యం త్రాంగం సహాయక చర్యలు ముమ్మరం చేశారు. రామప్ప, పా కాల సరస్సులు, భద్రకాళీ, వడ్డేపల్లి, తదితర చెరువులు మత్తడిపోస్తున్నాయి. ఇక ఆకేరు, మున్నేరు, జంపన్నవాగులు పొంగిపొర్లుతున్నాయి. వరంగల్‌ నగరంలో జనజీవనం అస్తవ్యస్తమైం ది. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

వర్షపాతం వివరాలు

ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 101.6 మిమీ, రూరల్‌ జిల్లాలో 99.2 మి.మీ, జయశంకర్‌-భూపాలపల్లి జిల్లాలో 91.5 మి.మీ, ములుగు జిల్లాలో 149.47 మి.మీ వర్షపాతం నమోదైంది.

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో..

హన్మకొండ-కరీంనగర్‌ ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. నగరంలోని వడ్డేపల్లి చెరువు కింద పదుల సంఖ్య లో కాలనీలు జలమయమయ్యాయి. జలదిగ్బంధంలో చిక్కుకున్న కాలనీల్లో సహాయక చర్యలకు వరద ఉధృతి ఆటంకం కలిగిస్తున్నది. మరోవైపు భద్రకాళీ చెరువు మత్తడి పోస్తుండడంతో చెరువు కింద ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాజీపేట నుంచి కాకతీయ యూనివర్సిటీ 100 ఫీట్ల రోడ్లు గోపాల్‌పూర్‌ దగ్గర పదిమీటర్ల పొడవునా కోతకు గురైంది. 

ములుగు జిల్లాలో..

రామప్ప చెరువు అలుగు పోస్తుండడంతో పాల్‌సాబ్‌పల్లి, పాపయ్యపల్లి, బరిగలానిపల్లి గ్రామాలకు వరద నీరు చేరింది. ఏటూరునాగారం మండలంలోని మల్యాల సమీపంలో జంపన్నవాగుపై నిర్మించిన వంతెన మధ్య భాగం వరద ఉధృతికి కుంగింది. కొండాపురం వాగు నీరు బ్రిడ్జి పైనుంచి ప్రవహిస్తుండడంతో వెంకటాపురం నుంచి భద్రాచలంకు వాహనాల రాకపోకలు బందయ్యాయి. పాలెంవాగు కాల్వకు గండి పడింది. రామ న్నగూడెం పుష్కరఘాట్‌ వద్ద 10.140 మీటర్లకు చేరింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కమలాపురం బిల్ట్‌ ఇన్‌టేక్‌ వెల్‌వద్ద సముద్ర మట్టానికి 83.5 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంత గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గోదావరి నది పేరూరు వద్ద 49 అడుగుల మేర ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో 149.47 మి.మీ వర్షపాతం నమోదైంది.

వరంగల్‌ రూరల్‌లో 

మాదన్నపేట పెద్ద చెరువు ఆదివారం 6 ఫీట్లతో మత్తడి పో సింది. పాకాల సరస్సు పూర్థిస్థాయిలో నిండి 6 అడుగుల మేర మత్తడి పోస్తోంది. చలివాగు ప్రాజెక్టు ఆదివారం 25 అడుగుల కు నీటిమట్టం చేరింది. కటాక్షపురం ప్రధాన రహదారిపై రెండు రోజులుగా వాహనాలు ఎక్కడికక్కడే స్తంభించిపోయాయి. జిల్లాలో సగటున 99.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

జనగామలో..

జనగామ జిల్లా కేంద్రం సహా పలు గ్రామాల్లో లోతట్టు ప్రాం తాలు, కాలనీలు జలమయమయ్యాయి. చీటకోడూరు రిజర్వాయర్‌ నిండడంతో అధికారులు గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. 

మహబూబాబాద్‌లో..

జిల్లాలో సహాయ చర్యల కోసం 08719 241950, 0871 9 240400, 08719 298526, వాట్సాప్‌ నంబర్‌ 7995 074803ను కంట్రోల్‌ రూంలో అందుబాటులో ఉంచారు. 

జయశంకర్‌ భూపాలపల్లిలో

పరకాల రోడ్డు నాగారం లోలెవల్‌ కాజ్‌వేపై వరదతో రాకపోకలు బందయ్యాయి. బొర్రవాగు, బొప్పారం వాగు, గంగారం-విలాసాగర్‌ మ ధ్యనున్న అలుగువాగు వద్ద రహదారులను పూర్తిగా మూసివేశారు. జిల్లాలో 91.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.