గురువారం 21 జనవరి 2021
Warangal-rural - Aug 16, 2020 , 03:33:48

ముమ్మరంగా సహాయ చర్యలు

ముమ్మరంగా సహాయ చర్యలు

  • ముంపు ప్రాంతాలను పరిశీలించిన ప్రజాప్రతినిధులు, అధికారులు

నయీంనగర్‌/ హన్మకొండ : ఎడతెరిపి లేని వర్షాలకు ఓరుగల్లు మహానగరం జల దిగ్బంధం లో చిక్కుకోగా అధికారులు, ప్రజాప్రతినిధులు లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు.  ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, అర్బన్‌ కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, మున్సిపల్‌ అధికారులు, స్థానిక కార్పొరేటర్లతో కలిసి కలిసి అంబేద్కర్‌నగర్‌, అలంకార్‌, కాకతీయకాలనీ, నయీంనగర్‌, పెద్దమ్మగడ్డ, సమ్మయ్యనగర్‌, దీన్‌దయల్‌నగర్‌, వడ్డెపల్లిలో పర్యటించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. నగరంలో నెలకొన్న పరిస్థితిపై మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. పునరావాస కేంద్రాలతో పాటు బాధిత ప్రజలకు ఆహార పదార్థాలను అందించాలని కలెక్టర్‌ను కోరగా ఆమేరకు ఏర్పాట్లు చేశారు. వరద ముంపుకు పొం చి ఉన్న ప్రాంతాల వారు ముందస్తుగానే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని కోరా రు. వడ్డెపల్లిలో మత్స్యకారులను చేపల వేటకు అనుమతించవద్దని పోలీసులకు సూచించారు. 

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎమ్మెల్యే అరూరి రమేశ్‌

మరో రెండు, మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి, ఇళ్లకే పరిమితం కావాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ సూచించారు. వందఫీట్లరోడ్డులో భారీ గా వరద నీరు ప్రవహిస్తుండడంతో స్థానిక నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.      


logo