శనివారం 23 జనవరి 2021
Warangal-rural - Aug 15, 2020 , 06:23:44

కుండ‌పోత‌

కుండ‌పోత‌

  • n ఉమ్మడి జిల్లాలో శుక్రవారం దంచికొట్టిన వర్షం
  • n వాగులు, వంకల్లో ఉధృతంగా వరద ప్రవాహం
  • n మత్తడి దుంకుతున్న చెరువులు
  • n వాగుల పరిసర గ్రామాల్లో నిలిచిన రాకపోకలు
  • n గోదావరి తీర గ్రామాలను అప్రమత్తం చేసిన అధికారులు
  • n వరద సహాయక చర్యలకు కంట్రోల్‌ రూం నంబర్‌ 8008060434 ఏర్పాటు

నాలుగైదు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వాన, ఉన్నట్టుండి శుక్రవారం దంచికొట్టింది. ఉమ్మడి జిల్లా అంతటా వర్ష ప్రభావం కనిపించగా వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మున్నెన్నడూ లేనివిధంగా దాదాపు 80శాతం చెరువులు నిండుకుండల్లా మారి మత్తడి దుంకుతున్నాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చగా తీర ప్రాంత గ్రామాలను అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. వరద సహాయక చర్యల కోసం ఏటూరునాగరంలో కంట్రోల్‌ రూం (8008060434) ఏర్పాటు చేశారు. 

- నమస్తే తెలంగాణ, నెట్‌వర్క్‌

నమస్తే తెలంగాణ, నెట్‌వర్క్‌ : ఉమ్మడి జిల్లాలో ఎడతెరిపిలేకుం డా వర్షం కురుస్తున్నది. వరద నీటితో వాగులు, వంకలు ఉ ప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు నిండి మత్తళ్లు దుంకుతున్నాయి. వాగుల పరిసర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు చో ట్ల పెంకుటిళ్లు, పూరి గుడిసెలు కూలిపోయాయి. చెరువులు జలకళ ను సంతరించుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షంలోనే పొలం పనులు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల పంట పొ లాలు నీట మునిగాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సంబంధిత గ్రామాల వారు చేపలు పట్టేందుకు ఉత్సాహం చూపుతున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 1052 చెరువులకు 1032 చెరువులు మత్తళ్లు దూకుతున్నాయి.