శుక్రవారం 27 నవంబర్ 2020
Warangal-rural - Aug 14, 2020 , 03:02:39

రుద్రేశ్వరుడి సన్నిధిలో కమిషనర్‌ కరుణ

రుద్రేశ్వరుడి సన్నిధిలో కమిషనర్‌ కరుణ

రెడ్డికాలనీ, ఆగస్టు 13: చారిత్రాక రుద్రేశ్వ రాలయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ సందర్శించారు. ఆమెకు ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వ ర్యంలో అర్చకులు స్వాగతం పలికి, హారతిఇచ్చి దర్శనం కల్పించారు. ఆలయ అభివృద్ధికి తోడ్ప డిన కరుణను దేవాలయం పక్షాన స్వామి వారి శేషవస్ర్తాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వాకాటి కరుణ కుడా వైస్‌ చైర్మన్‌ పమేలా సత్పతి తో మాట్లాడి ఆగిపోయిన ఆలయ అభివృద్ధి కార్య క్ర మాలు జరిగేలా కృషి చేస్తానన్నారు. ఆమె వెంట ఆర్డీవో వాసుచంద్ర, ఎమ్మార్వో కిరణ్‌ప్రకా శ్‌, జిల్లా సర్వైలైన్స్‌ ఆఫీసర్‌ శ్రీక్రిష్ణారావు, అర్చ కులు మణికంఠ, ప్రణవ్‌, ఆలయ ఈవో వేణుగో పాల్‌, టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు కోలా రాజేశ్‌కు మార్‌గౌడ్‌, సిబ్బంది పాల్గొన్నారు.