సోమవారం 18 జనవరి 2021
Warangal-rural - Aug 14, 2020 , 03:02:57

త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేయాలి

త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేయాలి

  •  అర్బన్‌ కలెక్టర్‌ ఆర్జీ  హన్మంతు
  • పీఎంఎస్‌ఎస్‌వై సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ సందర్శన

వరంగల్‌ చౌరస్తా, ఆగస్టు13: వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కళాశాల ఆవరణలోని పీఎంఎస్‌ఎస్‌వై సూపర్‌ స్పెషాలిటీ హాస్పటల్‌లో కరోనా వైద్య సేవలు అందించ డానికి అవసరమైన ఏర్పాట్లను నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ ఆర్జీ హన్మంతు అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం పీఎంఎస్‌ఎస్‌వై హాస్పటల్‌ను ఆయన పరిశీలించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం కృత నిశ్చయం తో ఉందని అన్నారు. అందుకు పీఎంఎస్‌ఎస్‌వై హాస్ప టల్‌ భవనాన్ని వినియోగించుకోవడానికి అనుమతులు ఇచ్చిందని, అత్యవసరంగా రూ. 12  కోట్లు సైతం మం జూరు చేసిందని అన్నారు. భవనంలోని రెండు అంత స్తులను సిద్ధం చేయాలని ఆయన అన్నారు. వైద్య సేవ లకు అవసరమైన చర్యలను వెంటనే పూర్తి చేయాలని, ఆక్సిజన్‌ వెంటిలేటర్లను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కన్సల్టెన్సీ ప్రతినిధి నాగేందర్‌ రెడ్డిని ఆదేశించారు. ఎంజీఎంలోని ఫీవర్‌ వార్డు, సర్జికల్‌ విభాగం పాత భవ నాల్లో అదనంగా మరో 150 పడకలను అందుబాటు లోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగార్జున్‌రెడ్డిని ఆదేశించా రు. కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ పమేలా సత్పతి, కేఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంధ్య, ఆర్డీవో వాసు చంద్ర, తహసీల్దార్‌ కిరణ్‌ ప్రకాశ్‌ పాల్గొన్నారు.