శుక్రవారం 15 జనవరి 2021
Warangal-rural - Aug 14, 2020 , 03:02:55

కొవిడ్‌ పరీక్షలను పకడ్బందీగా చేయాలి

కొవిడ్‌ పరీక్షలను పకడ్బందీగా చేయాలి

  • ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి

నర్సంపేట: కొవిడ్‌ పరీక్షలను పకడ్బందీగా చేయాలని నర్సంపేట ఎమ్మె ల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. గురువారం నల్లబెల్లి ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూల గ్రామాలు, ఏజెన్సీలో సైతం ప్రతి రోజూ కరోనా పరీక్షలను నిర్వహించాలని అన్నారు. సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిం చాలని కోరారు. పేద వారిని రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా నర్సంపే టలో ఏర్పాటు చేసిన పెద్ది ఐసొలేషన్‌ కేంద్రంలో ఉండేలా అవగాహన కల్పించాలని కోరారు. గ్రామాల్లో వర్షాలకు పారిశుధ్య సమస్యలు తలెత్తు తాయని అన్నారు. చెత్తను ప్రతి రోజూ డంపింగ్‌ యార్డులకు తరలించాలని కోరారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.