మంగళవారం 27 అక్టోబర్ 2020
Warangal-rural - Aug 14, 2020 , 02:26:11

పీజీ విద్యార్థిని అదృశ్యం

పీజీ విద్యార్థిని అదృశ్యం


చెన్నారావుపేట, ఆగస్టు13: పీజీ విద్యార్థిని అదృశ్యమైన ఘటన మండలంలోని చెరువుకొమ్ముతండా గ్రామ శివారు మంగల్‌ తండాలో గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకా రం.. ఇదే తండాకు చెందిన బోడ ఈర్య-రాజీ దంపతుల కూతురు బోడ స్రవంతి నర్సంపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో పీజీ చదువుతోంది. ఈ నెల 9న నర్సంపే టలో పని ఉందని ఇంట్లో కుటుంబసభ్యులకు చెప్పి వెళ్లింది. సాయంత్రమైనా తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబసభ్యులు బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో స్రవం తి తల్లి గురువారం సాయంత్రం చెన్నారావుపేట పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై షాఖాన్‌ తెలిపారు.logo