ఆదివారం 25 అక్టోబర్ 2020
Warangal-rural - Aug 14, 2020 , 01:55:06

ఖానాపూర్‌లో అత్యధిక వర్షం

ఖానాపూర్‌లో అత్యధిక వర్షం

కలెక్టరేట్‌: జిల్లాలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా ఖానాపూర్‌లో 79.4 మిల్లీ మీటర్లు, అత్యల్పంగా ఆత్మకూరులో 28.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు సీపీవో శామ్యూల్‌ తెలిపారు. పరకాలలో 30.2 మి.మీ, శాయంపేటలో 41.4 మి.మీ, గీసుగొండలో 57.6 మి.మీ, దుగ్గొండిలో 40.2 మి.మీ, నల్లబెల్లిలో 42.6 మి.మీ, నర్సంపేటలో 49.2 మి.మీ, చెన్నారావుపేటలో 63.6 మి.మీ, సంగెంలో 40.6 మి.మీ, వర్ధన్నపేటలో 40.4 మి.మీ, రాయపర్తిలో 34.2 మి.మీ, పర్వతగిరిలో 45.8 మి.మీ, నెక్కొండలో 63.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు.


logo