గురువారం 01 అక్టోబర్ 2020
Warangal-rural - Aug 13, 2020 , 02:35:52

తెల్ల బంగారు క్షేత్రం

తెల్ల బంగారు క్షేత్రం

  • n నియంత్రిత సాగులో పత్తి టాప్‌
  • n దూదిపూలకే రైతుల జేజేలు
  • n వానకాలం మక్కకు గుడ్‌బై
  • n వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో పెరిగిన విస్తీర్ణం
  • n గతేడాది సాగు : 7,26,866 ఎకరాలు
  • n ఈఏడాది : 7,81,899 ఎకరాలు
  • n అదనంగా పెరిగింది : 55,033 ఎకరాలు
  • n ముగిసిన సర్వే.. తేలిన పత్తి సాగు విస్తీర్ణం లెక్క 

మూస పద్ధతికి స్వస్తి పలికి.. నియంత్రిత సాగు విధానం పాటించి లాభాలు పొందాలని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపునకు రైతులు సంపూర్ణ మద్దతు తెలిపారు. రాష్ట్ర సర్కారు మాటే వేదవాక్కుగా తీసుకొని మార్పునకు నాంది పలికారు. వరంగల్‌అర్బన్‌, ములుగు జిల్లాలు మినహా వరంగల్‌ రూరల్‌, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల్లో కర్షకులు ఈ వానకాలం సీజన్‌లో మక్కకు గుడ్‌బై చెప్పి దూదిపూల సాగువైపు మళ్లారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో గతేడాది 7,26,866 ఎకరాల్లో పత్తి సాగవగా ఈ ఏడు 7,81,899 ఎకరాల్లో పంట వేసినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. ఈ సారి అదనంగా 55,033 ఎకరాల్లో ‘తెల్ల బంగారం’ సాగవుతున్నట్లు సర్వేలో తేల్చారు. 

- వరంగల్‌ రూరల్‌, నమస్తేతెలంగాణ

వరంగల్‌ రూరల్‌ 1,73,770 2,01,238

జనగామ 1,75,000 1,80,000

జయశంకర్‌ భూపాలపల్లి 1,29,481 1,42,429

మహబూబాబాద్‌ 1,18,530 1,32,250

వరంగల్‌అర్బన్‌ 77,220 75,982

ములుగులో 52,865 50,000

వరంగల్‌ రూరల్‌, నమస్తే తెలంగాణ/నర్సంపేట : నియంత్రిత సాగు విధానం పాటించాలని రాష్ట్ర సర్కారు ఇచ్చిన పిలుపునకు రైతులు సంపూర్ణ మద్దతు పలికారు. ఈ సీజన్‌లో మక్కకు గుడ్‌బై చెప్పి పత్తిసాగువైపు మళ్లారు. వానకాలం పంటల సాగుపై వ్యవసాయాధికారులు సర్వే చేసి ఏ పంట ఎన్నెకరాల్లో వేశారనే లెక్క తేల్చారు. ఈ సర్వే ద్వారా రైతులు నియంత్రిత పంటల సాగు విధానానికి జై కొట్టినట్లు స్పష్టంగా వెల్లడైంది. ప్రభుత్వం ప్రణాళిక ప్రకారమే ఇతర పంటలు వేశారు. ప్రధానంగా దూదిపూల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడం విశేషం. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రికార్డు స్థాయిలో  ఈ సారి పత్తి సాగు విస్తీర్నం 7.82 లక్షల ఎకరాలకు చేరింది. గతేడాది కంటే అదనంగా 55వేల ఎకరాల్లో పత్తి సాగులోకి వచ్చింది. ములుగు, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలు మినహా ఇతర నాలుగు జిల్లాల్లో పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. తర్వాత స్థానంలో వరి ఉండబోతుండగా ఆగస్టు నెలాఖరుదాకా నాట్లు కొనసాగే అవకాశముంది. ఇప్పటికే సాగు ప్రణాళికలోని వరి పంట విస్తీర్ణంలో యాభై శాతం సాగులోకి వచ్చినట్లు వ్యవసాయాధికారులు గుర్తించారు. రైతుల మేలు కోసం ఈ ఏడాది నుంచి వ్యవసాయంలో నియంత్రిత పంటల సాగు విధానం అమలుకు సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలే సాగు చేయాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు. వానకాలం సీజన్‌లో మక్క వంటి పంటను సాగు చేయకుండా పంటల మార్పిడితో ప్రభుత్వం సూచించిన ఇతర పంటలు సాగు చేయాలన్నారు. వరిసాగు తగ్గించి పత్తి, కంది సాగు విస్తీర్ణం పెంచాలని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రస్తుత వానకాలం నుంచి ప్రభుత్వం రాష్ట్రంలో నియంత్రిత పంటల సాగు విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రభుత్వం ఖరారు చేసిన ప్రణాళిక ప్రకారమే పంటలు సాగు చేయాలని రైతులను కోరింది. వానకాలం సీజన్‌లో మక్క సాగుకు స్వస్తి చెప్పాలని, వరిలో కచ్చితంగా అరవై శాతం సన్నరకాలుండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సీజన్‌ ప్రారంభానికి ముందే గ్రామం వారీగా వానకాలం సాగు చేయాల్సిన పంటల ప్రణాళికను వ్యవసాయశాఖ అధికారులు రూపొందించారు. అనంతరం ఆయా జిల్లాలో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో రైతుబంధు సమితుల ప్రతినిధులతో చర్చించి సాగు ప్రణాళిక ఖరారు చేశారు. తర్వాత ప్రజాప్రతినిధుల సహకారంతో నియంత్రిత పంటల సాగు విధానంపై ఊరూరా రైతులకు అవగాహన కల్పించారు. యాక్షన్‌ ప్లాన్‌ ప్రకారం ప్రభుత్వం విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులోకి తెచ్చింది. వ్యవసాయరంగంలో కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్‌ సీజన్‌లోనే రైతులు సీఎం కేసీఆర్‌ నిర్ణయానికి జై కొట్టారు. ఆయన చెప్పినట్లుగానే మక్క జోలికి వెళ్లకుండా ఇతర పంటలు సాగుకు సై అన్నారు.

పత్తి సాగులో రికార్డు

వానకాలం పంటల సాగుపై వ్యవసాయాధికారులు జూలై 31దాకా సర్వే చేశారు. గ్రామం వారీగా రైతులు ఏ పంట ఎన్ని ఎకరాల్లో సాగు చేశారనే వివరాలు సేకరించారు. వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో) గతంలో మాదిరిగా తామే పంటల సాగు విస్తీర్ణంపై నిర్ణయానికి వచ్చి నమోదు చేయడం గాకుండా ఈసారి స్వయంగా రైతులను కలిసి సర్వే ఫారంపై వారి సంతకాలు కూడా తీసుకున్నారు. ఇలా పంటల సాగు వివరాలను పక్కాగా నమోదు చేశారు. సర్వేలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా రైతులు మున్నెన్నడూ లేని రీతిలో అత్యధికంగా 7,81,899 ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు చేసి రికార్డు సృష్టించినట్లు తేలింది. ఈ ఏడాది జిల్లాల వారీగా రైతులు సాగు చేసిన పత్తి పంట సాగు విస్తీర్ణం పరిశీలిస్తే వరంగల్‌ అర్బన్‌, ములుగు జిల్లాల్లో గతేడాదికంటే కొంత తగ్గింది. ఇతర నాలుగు జిల్లాల్లో పెరగడంతో ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం మరో 55,033 ఎకరాలు పెరిగింది. జిల్లా వారీగా గతేడాది వానకాలం వరంగల్‌ రూరల్‌లో 1,73,770, జనగామలో 1,75,000, జయశంకర్‌ భూపాలపల్లిలో 1,29,481, మహబూబాబాద్‌లో 1,18,530, వరంగల్‌ అర్బన్‌లో 77,220, ములుగులో 52,865 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. ఈ ఏడాది వానకాలం వరంగల్‌రూరల్‌లో 2,01,238, జనగామలో 1,80,000, భూపాలపల్లిలో 1,42,429, మహబూబాబాద్‌లో 1,32,250, వరంగల్‌ అర్బన్‌లో 75,982, ములుగులో 50,000 ఎకరాల్లో పత్తి సాగులోకి వచ్చినట్లు సర్వేలో వెల్లడైంది. జనగామ జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం మరికొంత పెరిగే అవకాశముంది. మక్క స్థానంలో రైతులు ఈ వానకాలం ఎక్కువగా పత్తి సాగు చేసినట్లు వ్యవసాయాధికారులు భావిస్తున్నారు. 

మొత్తం పత్తి వేసిన


నాకు ఎకరంన్నర భూమున్నది. అందులో మొన్నటిదాక మక్క పండించిన. ప్రభుత్వం చెప్పినంక ఇప్పుడు మొత్తం పత్తి సాగు చేస్తున్న.  పత్తి లాభసాటిగా ఉంటదని వ్యవసాయాధికారులు సూచించిన్రు. పత్తేసి నెల రోజులైంది. చేను పెరుగుతాంది. ఎక్కువ దిగుబడి కోసం కృషి చేస్తున్న.  

- బోనగిరి నర్సయ్య, రైతు, అక్కల్‌చెడ (నర్సంపేట)logo