శుక్రవారం 30 అక్టోబర్ 2020
Warangal-rural - Aug 12, 2020 , 02:40:05

ఇక e - పాఠాలు

ఇక e - పాఠాలు

కరోనా విజృంభణతో ప్రభుత్వం ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేసి  ఫెయిలైన విద్యా ర్థులందరినీ కంపార్టుమెంట్‌ పాస్‌ చేసింది. ఈ క్రమంలో విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఈ నెల 17 నుంచి ఇంటర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనుంది. సెప్టెంబర్‌ 1 నుంచి కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉన్నది. అదేవిధంగా 3, 4, 5 తర గతుల విద్యార్థులకు సెప్టెంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహించనుంది. 6, 7, 8, 9, 10 తరగ తులకు ఈ నెల 20 నుంచి టీ-శాట్‌, దూరదర్శన్‌ చానళ్ల ద్వారా పాఠాలు బోధించనున్నది. కొవిడ్‌-19 నేపథ్యంలో వివిధ ప్రవేశ పరీక్షలు, విద్యా సంవత్సరం అమలు విధివిధానాలను ఖరారు చేసేందుకు అధి కారులు, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డితో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఇందులో ఈ నెల 20 నుంచి మూడు నుంచి 5వ తరగతి విద్యార్థులకు డిజిటల్‌ తరగతులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. 

17 నుంచి పాఠశాలలకు పంతుళ్లు..

ఈ నెల 17 నుంచి స్కూళ్లకు టీచర్లు రానున్నా రు. కొవిడ్‌-19 నిబంధనల మేరకు రోజూ ప్రతి పాఠశాలలో 50 శాతం టీచర్లు హాజరయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులకు అం దిస్తున్న ఆన్‌లైన్‌ పాఠాలను పర్యవేక్షిస్తూ టీసీలు, తదితర పనులు వారికి అప్పగించనున్నారు.

ఉమ్మడి జిల్లాలో 49 కాలేజీ విద్యార్థులకు..

ఈ నెల 17 నుంచి నిర్వహించనున్న ఆన్‌లైన్‌ తరగతులతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 49 ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు మేలు జరగనున్నది. మహబూబాబాద్‌ జిల్లాలో 10, వరంగల్‌ అర్బన్‌ లో 9, వరంగల్‌ రూరల్‌లో 12, ములుగులో 8, జనగామలో 5, జయశంకర్‌ భూపాలపల్లిలో 5 కాలేజీ లు ఉన్నాయి.