ఆదివారం 17 జనవరి 2021
Warangal-rural - Aug 11, 2020 , 01:41:01

కృష్ణం వందే జగద్గురుం

కృష్ణం వందే జగద్గురుం

  • నల్లనయ్య పుట్టుకే ఓ మహాద్భుతం
  • మానవాళికి మంగళప్రదం
  • నేడు శ్రీకృష్ణాష్టమి
  • కొవిడ్‌తో ఇళ్లలోనే పూజలు  

ఖిలా వరంగల్‌ : లోక కల్యాణం కోసం శ్రీ కృష్ణ భగవానుడు కారాగారంలో జన్మించాడు. నల్లన య్య పుట్టు కే ఓ మహా విశేషం. మానవత్వంలో దైవత్వాన్ని చూపిన కృష్ణావతారం ఒక అద్భుతం. యుగయుగాలుగా శ్రీ కృ ష్ణుడితత్వం.. జీవితం మానవ జాతిని విశేషంగా ప్రభావితం చేస్తున్నది. శ్రీమన్నారాయణుడు దైవ, మానవోద్ధరణ కోసం దశావతారాలు ఎత్తాడు. దైవమైనా, మానవుడైనా జీవితకాలంలో అనేకానేక కష్టనష్టాలు, ఆపదల నుంచి విముక్తి పొందే మార్గాలను చూపడమే ఈ అవతారాల పరమార్థం. కలియుగం నడుస్తున్నా ద్వాపరయుగంలో జగద్గురువుగా శ్రీకృష్ణ భగవా నుడు చూపిన అనేక మార్గాలను అవలంబిస్తూ నేడు ఆపదల నుంచి గట్టెక్కేందుకు మనం నిర్వ హించుకునే ఉత్సవమే శ్రీకృష్ణాష్టమి. నేడు ఈ వేడుకను జిల్లా అంతటా ఘనంగా జరుపుకొనేందుకు ప్రజలు సిద్ధమయ్యారు.విషపు పాలు ఇచ్చిన ‘పూతన’ స్థనాన్ని శ్రీకృష్ణుడు మృదువుగా స్వీక రించి తుదముట్టించిన చందంగా కరోనా పీడ ఈ కృష్ణాష్టమితో దూరమవ్వాలనే కాంక్షతో ఈ ఏడాది భక్తులు ఇళ్లల్లోనే పూజలుచేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

శ్రీ కృష్ణ జన్మోత్సవం.. మానవజాతికి మంగళప్రదం

భక్తిశ్రద్ధలు లోపించకుండా ఆచార వ్యవహారా లను అవలంబిస్తూ నిష్టా గరిష్టులమై గోవు పంచ కం, గోవు పేడతో ఇంటిని శుద్ధి చేసుకుంటారు. ఫల, పుష్పాదులతో ఆరాధించి కన్నయ్యకు వెన్న ముద్దలు నైవేద్యంగా సమర్పించి కన్న తల్లిదం డ్రుల వలె మురిసిపోతారు. ‘వసుదేవ సుతం దేవం కంస చానూర మర్దనం కృష్ణం వందే జగద్గు రుం’ అంటూ సాష్టాంగపడి మనో నేత్రంతో ఆ గోపాల బాలుడిని సాక్షాత్కరించుకుంటారు. లోక కల్యా ణం కోరుతూ శ్రీకృష్ణుడిని మనసారా పూజిస్తారు. అయి తే ఈసారి కొవిడ్‌ కారణంగా ఎ లాంటి ఉత్సవాలు లేకుండానే ఇళ్లలోనే కన్నయ్యను కొలిచేందుకు భక్తులు సిద్ధమయ్యారు.