ఆదివారం 17 జనవరి 2021
Warangal-rural - Aug 09, 2020 , 11:35:40

12 నుంచి మార్కెట్‌లో క్రయవిక్రయాలు

12 నుంచి మార్కెట్‌లో క్రయవిక్రయాలు

కాశీబుగ్గ, ఆగస్టు 8 : వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఈ నెల 12 నుంచి క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని చైర్మన్‌ చింతం సదానందం తెలిపారు. శనివారం మార్కెట్‌ ప్రధాన కార్యాలయంలోని చైర్మన్‌ చాంబర్‌లో చాం బర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకొని రైతులతో పాటు ఇతర కార్మికులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ శానిటైజర్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. అడ్తి, ఖరీదు వ్యాపారులతో పాటు రైతులు, ఇతర కార్మికులు వ్యక్తిగత దూరంతో పాటు మాస్కులు ధరించాలని కోరారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

రోజూ శానిటైజేషన్‌ చేయాలి

వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ లో రోజూ శానిటైజేషన్‌ చేయాలని చాంబర్‌ ప్రతినిధులు కోరారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న క్రమం లో మార్కెట్‌లో కొన్ని రోజులుగా క్రయవిక్రయాలు నిలిపివేశారని, ఈ క్రమంలో రైతులకు కేటాయించిన షెడ్‌ ప్రదేశంలోనే సరుకును వేసుకోవాలని సూచించారు.  సమావేశంలో కార్యదర్శి అజ్మీరా రాజునాయక్‌, చాంబర్‌ ప్రధాన కార్యదర్శి తోట నర్సింహారావు, అడ్తి సెక్షన్‌ అధ్యక్షుడు పోతు కుమారస్వామి, పర్యవేక్షకులు కృష్ణమీనన్‌, భూక్య వెంక న్న, ముడిదే శివకుమార్‌, నల్ల నర్సింహారావు, కనుకుంట్ల వినయ్‌కాంత్‌, సాగర్‌ పాల్గొన్నారు.