పేదింటికి వరం.. కల్యాణలక్ష్మి

నర్సంపేట, ఆగస్టు5: పేదింటికి వరంలా కల్యా ణలక్ష్మి పథకం మారిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నల్లబెల్లి మండలంలో కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు బు ధవారం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఆడపడుచుల వివాహా లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టారని అన్నారు. ఉద్యమ కాలంలో ములుగులో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని అమ లు చేశారని తెలిపారు. వివాహాలకు లగ్గం కోటు వేసుకున్న తర్వాత దరఖాస్తులు చేస్తే పెళ్లి సమ యం నాటికి చెక్కు అందిస్తామని అన్నారు. ఆరో గ్యశ్రీలో వర్తించని ఎన్నో రోగాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్వోసీలతో వైద్య చికిత్సలు చేయించు కోవాలని అన్నారు. పది మంది గిరిజన మహిళల కు రూ.10.16 లక్షలు, 41 మంది పేదలకు రూ. 10.80 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ను అందించారు. అనంతరం మండల కేంద్రంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నల్లబెల్లి ఎంపీపీ ఊడుగుల సునీతాప్రవీణ్గౌడ్, తహసీల్దార్, ఎంపీడీవో, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- లాజిస్టిక్ పార్క్ రెడీ..
- తెలుగు భాషకు ప్రాణం పోసిన మహనీయుడు ‘గిడుగు’
- ఘనంగా పద్మమోహన-టీవీ అవార్డ్స్...
- బాధితులకు సత్వర న్యాయం అందించడానికి కృషి
- త్యాగధనుల కృషి ఫలితమే గణతంత్రం
- సీసీఎంబీ పరిశోధనలు అభినందనీయం
- కామునిచెరువు సుందరీకరణపై స్టేటస్కో పొడిగింపు
- సీజనల్ వ్యాధులపై వార్
- రాణిగంజ్ ఆర్యూబీ విస్తరణకు చర్యలు
- ఆటకు లేదు లోటు