గురువారం 21 జనవరి 2021
Warangal-rural - Aug 06, 2020 , 03:37:45

భక్తిశ్రద్ధలతో పోచమ్మ బోనాలు

భక్తిశ్రద్ధలతో పోచమ్మ బోనాలు

వేలేరు, ఆగస్టు 5: భక్తిశ్రద్ధలతో బుధవారం జిల్లాలో పోచమ్మ బోనాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలతో ఆలయాలకు వెళ్లి మొక్కులు చెల్లించారు. వేలేరు మండలంలోని ఎర్రబెల్లి గ్రామంలో పోచమ్మ బోనాలు నిర్వహించారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. కరోనా నేపథ్యంలో ప్రజలు మాస్కూలు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గూడ కవిత రాజ్‌కుమార్‌, ఉపసర్పంచ్‌ అల్లం సతీశ్‌, స్థానికులు ప్రదీప్‌, రాజశేఖర్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.  

భగత్‌సింగ్‌నగర్‌లో..

మిల్స్‌కాలనీ : గ్రేటర్‌ పరిధిలోని 11వ డివిజన్‌ భగత్‌సింగ్‌నగర్‌లో పోచమ్మ బోనాలను కాలనీవాసులు ఘనంగా జరుపుకున్నారు. ఆలయ ప్రాంగణంలో కోళ్లు, గొర్రెలను బలిచ్చి ఇంటిల్లిపాదిని సల్లంగ చూడాలని పోచమ్మతల్లిని వేడుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షురాలు జంగం రజిత, వెంగల రాజమణి, ఆకోజు జగన్నాథాచారి, భారతమ్మ, చక్రపాణి పాల్గొన్నారు. 

ఆరెపల్లిలో..

హసన్‌పర్తి : గ్రేటర్‌ ఒకటో డివిజన్‌ ఆరెపల్లిలో ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. 56వ డివిజన్‌ హసన్‌పర్తి, ఒకటో డివిజన్‌ ఆరెపల్లిలో భక్తులు కోళ్లు, కొబ్బరికాయలతో బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

మడికొండలో..

మడికొండ : పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుమ్మరి వంశస్తులు మట్టి కుండలో మొదటి బోనం సమర్పించారు. కార్పొరేటర్లు జోరిక రమేశ్‌, తొట్ల రాజుయాదవ్‌, లింగం మౌనికారెడ్డి, దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు బుర్ర రాజేందర్‌, నర్మెటి భిక్షపతి, పేపర్‌ రవి, బొల్లికొండ వినోద్‌, కొలిపాక వెంకటస్వామి, తీగల శ్రీకాంత్‌ పాల్గొన్నారు. logo