మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Warangal-rural - Aug 05, 2020 , 03:26:15

ప్రజలకు అండగా ఉంటాం : ఎమ్మెల్యే రాజయ్య

ప్రజలకు అండగా ఉంటాం : ఎమ్మెల్యే రాజయ్య

  ధర్మసాగర్‌, ఆగస్టు 04 : ఆర్థిక మాంద్యం ఏర్పడినా ప్రజలకు అండగా ఉంటామని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం తహసీల్దార్‌ సీహెచ్‌ రాజు అధ్యక్షతన   19 మందికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే రాజయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని అన్నారు.   కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే రాజయ్య సూచించారు. జ్వరం ఉంటే డోలో 650 ఎంజీ, దగ్గు, జలుబు ఉంటే సిట్రిజిన్‌ మాత్రలు వేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం రాయగూడెం గ్రామంలో రైతు వేదిక పనులను పరిశీలించారు. ఎంపీపీ నిమ్మ కవిత, జిల్లా కోఆప్షన్‌ సభ్యురాలు జుబేదలాల్‌ మహ్మద్‌, ఏఎంసీ డైరెక్టర్‌ రజిత, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు సోమిరెడ్డి, సర్పంచ్‌ శరత్‌, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్‌ కరుణాకర్‌, ఎంపీడీవో జీ జవహర్‌రెడ్డి, ఆర్‌ఐ రాజు తదితరులు పాల్గొన్నారు. 

అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం 

వేలేరు : అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ టీ రాజయ్య అన్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం కల్యాణ లక్ష్మి పథకం చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్థిక మాంద్యం ఏర్పడినా సీఎం కేసీఆర్‌ పేదలకు అండగా ఉంటున్నారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చేయని విధంగా కల్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారని అన్నారు. రైతు బంధు పథకం ద్వారా 51లక్షల మంది రైతులకు ఏకకాలంలో పంట పెట్టుబడి సాయం అందించారని, రూ.25వేల లోపు రైతు రుణాలను మాఫీ చేశారని, 24గంటల ఉచిత విద్యుత్‌, రైతులకు సకాలంలో ఎరువులను, విత్తనాలను అందిస్తున్నారని వివరించారు. రైతువేదిక భవన నిర్మాణాలను చేపడుతున్నారని చెప్పారు. అనంతరం మండల కేంద్రంలో రైతువేదిక భవన నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎంపీపీ కేసిరెడ్డి సమ్మిరెడ్డి, జడ్పీటీసీ చాడ సరిత, వైస్‌ ఎంపీపీ ఆంగోతు సంపత్‌, ఎంపీడీవో రవీందర్‌, తహసీల్దార్‌ అబిద్‌ అలీ, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు కాయిత మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  


logo