బుధవారం 30 సెప్టెంబర్ 2020
Warangal-rural - Aug 04, 2020 , 10:27:22

మావోయిస్టులకు సహకరించొద్దు : సీఐ

మావోయిస్టులకు సహకరించొద్దు : సీఐ

ఆత్మకూరు: మావోయిస్టులకు ఎవరూ సహకరించొద్దని సీఐ రంజిత్‌కుమార్‌ సూచించారు. మావోయిస్టుల వారోత్సవాలను పురష్కరించుకుని కటాక్షపురం శివారులో సోమవారం వాహన తనిఖీలు చేపట్టారు. గుర్తుతెలియని వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు. తనిఖీల్లో ఎస్సై రాజబాబు, కానిస్టేబుళ్లు నాగేశ్వర్‌రావు, రమేశ్‌, హోంగార్డు కరుణాకర్‌ పాల్గొన్నారు.

కాపులకనపర్తిలో తనిఖీలు 

సంగెం: ఎస్సై సురేశ్‌ ఆధ్వర్యంలో పోలీసులు కాపులకనపర్తిలో వరంగల్‌-నెక్కొండ ప్రధార రహదారిపై వాహనాలను తనిఖీ చేశారు. క్షుణ్ణంగా పరిశీలించి అనుమానం ఉన్న వారిని విచారించి వదిలిపెట్టారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

రాయపర్తి: ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్సై మేకల లింగారెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిపై సిబ్బందితో కలిసి ఆయన వాహన తనిఖీలు నిర్వహించారు. ఆయన వెంట సిబ్బంది బొట్ల రాజు, కత్తుల శ్రీనివాస్‌, రమేశ్‌, సోమ్లానాయక్‌ ఉన్నారు.

తాజావార్తలు


logo