నియోజకవర్గానికి రెండు గోదాములు మంజూరు

- నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నర్సంపేట: రైతులకు ఉపయోగపడేలా 20 వేల మెట్రిక్ టన్ను ల సామర్థ్యం గల రెండు గోదాములు మంజూరైనట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. మరో 50 వేల మెట్రిక్ టన్నుల సామ ర్థ్యం గల గోదాములను నిర్మించాలని కోరుతూ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని సోమవారం హైదరాబాద్‌లో కలిసి పెద్ది వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో నర్సంపేట నియోజకవర్గంలో పంటల ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి సరైన గోదాములు లేక రైతులు అనేక ఇబ్బందులు పడేవారన్నారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలు ఇబ్బందులు పడకుండా గోదాములు నిర్మిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా కొవిడ్-19 లాక్డౌన్ లాంటి విపత్కర పరిస్థితిలో కూడా సీఎం కేసీఆర్ తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి రైతుకు బాసటగా నిలిచారన్నారు. గతంలో నియోజకవర్గంలో 30 వేల మెట్రిక్ టన్నుల గోదాములు ఉండేవన్నారు. వాటిలో మండలానికి ఐదు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు ఉండేవన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రూ. 16 కోట్లతో నియోజకవర్గంలో మరో రెండు గోదాముల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. దుగ్గొండి మండలంలోని చలపత్తి గ్రామంలో 10 వేల మెట్రిక్ టన్నులు, నర్సంపేట మండలం బాంజీపేట పరిధిలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములను మంజూరు చేసిందన్నారు. వీటిని వచ్చే యాసంగి పంట వరకు అందుబాటులోకి తెస్తామన్నారు. గోదాములు మంజూరు చేసిన మంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
- లాజిస్టిక్ పార్క్ రెడీ..
- తెలుగు భాషకు ప్రాణం పోసిన మహనీయుడు ‘గిడుగు’
- ఘనంగా పద్మమోహన-టీవీ అవార్డ్స్...
- బాధితులకు సత్వర న్యాయం అందించడానికి కృషి
- త్యాగధనుల కృషి ఫలితమే గణతంత్రం
- సీసీఎంబీ పరిశోధనలు అభినందనీయం
- కామునిచెరువు సుందరీకరణపై స్టేటస్కో పొడిగింపు
- సీజనల్ వ్యాధులపై వార్
- రాణిగంజ్ ఆర్యూబీ విస్తరణకు చర్యలు
- ఆటకు లేదు లోటు