మంగళవారం 19 జనవరి 2021
Warangal-rural - Aug 03, 2020 , 01:20:00

టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడి మృతి

టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడి మృతి

నర్సంపేట: టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు మునిగాల వెంకటేశ్వర్‌రావు,  పట్టణంలోని ఫర్టిలైజర్‌ షాపు యజమాని పబ్బతి సత్యనారాయణరెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని వేర్వేరు వైద్యశాలల్లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఈ సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం పెద్ది మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో వెంకటేశ్వర్‌రావు అగ్రభాగాన నిలిచారని, ఆయన సేవలు మరువలేనివన్నారు. 2001 తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో నర్సంపేట నుంచి టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్వర్‌రావు కొనసాగారని గుర్తుచేసుకున్నారు.