నేడు రాఖీ పౌర్ణమి..

- n పండుగపై కరోనా పడగ
- n దూరాన ఉన్న తోబుట్టువుల్లో కలత
- n ఈ సారి రాఖీలతో మాస్కులు, శానిటైజర్ల అందజేత
- n ఆన్లైన్, పోస్ట్‌లోనూ రాఖీల చేరవేత
జనగామ/నర్సంపేట రూరల్/ చెన్నారావుపేట/ వరంగల్ కల్చరల్ : రాఖీ పండుగ అంటేనే సోదర సోదరీమణుల ప్రేమానుబంధానికి ప్రతీక. ప్రస్తుతం కరోనా మ హమ్మారి పడగ కింద రాఖీ పండుగ చేసుకోవాల్సి వస్తున్నది. ఇప్పటికే హోలీ, ఏకాదశి, రంజాన్ పండుగలను ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రజలు జరుపుకొన్నారు. సోమవారం రాఖీ పండుగను సైతం నిబంధనల న నడుమే నిర్వహించుకోవాలి. ఎక్కడెక్కడో ఉండే అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కట్టేందుకు వెళ్తుంటారు. అన్నదమ్ములకు తిలకం దిద్ది, చేతికి ప్రేమతో రాఖీ కట్టి, మిఠాయి తినిపిస్తారు. సోదరులు తమ శక్తికొద్దీ కానుకలిస్తారు. ఒకరికొకరు తీపి తినిపించుకొని తమ అనుబంధా న్ని చాటుకుంటారు. కానీ, ఈసారి కొందరు తోబుట్టువు లు కరోనా కారణంగా ఒకరినొకరు కలుసుకోలేని పరిస్థితి వచ్చింది. ప్రయాణాలు చేయొద్దని, ఇంటి నుంచే రాఖీలతో పాటు మాస్కులను తమ సోదరులకు పోస్ట్, కొరియర్ల ద్వారా పంపాలని, ఫోన్లలోనే శుభాకాంక్షలు తెలపాలని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే తమ సోదరుల క్షేమం కోరే అక్కలు, చెల్లెలు రాఖీతో పాటు మాస్కు, శానిటైజర్‌ను అందించే ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే చాలా మంది రాఖీతో పాటు వాటిని కొనుగోలు చేశారు.
మనసు దోచే డిజైన్లు..
కాలానుగుణంగా రాఖీల డిజైన్లలో మార్పులు వస్తున్నాయి. గతంలో చిన్న స్పాంజ్పైన ప్లాస్టిక్ స్వస్తిక్, ఓంకారం వంటి బొమ్మలతో కూడిన రాఖీలు ఉండేవి. అవి కూడా కొన్ని రకాల్లో మాత్రమే అందుబాటులో ఉంటేవి. రానురాను నెమలి ఈకలు, నాణెల రూపంలో, బొమ్మల రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం మారుతున్న అభిరుచులకు అనుగుణంగా తయారీదారులు వినూత్న డిజైన్లు మార్కెట్లోకి తీసుకొచ్చారు. అయితే గతంలో కంటే ఈసారి ధరలు పెరిగినట్లు హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. ఈసారి వివాహిత మహిళలు తమ సోదరులకే కాదు వదిన, మరదళ్లకు కూడా కట్టేందుకు వీలుగా రాఖీలు మార్కెట్లోకి వచ్చాయి. వీటి ని లేడీస్ స్పెషల్ రాఖీలుగా పిలుస్తున్నా రు. వ్యాపారులు వీటిని ప్రత్యేకంగా ముంబై, ఢిల్లీ, కోల్కత్తా, అహ్మదాబా ద్, రాజ్‌కోట్, సూరత్, బరోడా నుంచి తెప్పించారు. అంతేకాకుండా విదేశాల్లో ఉండే తమ సోదరుల కోసం రాఖీ కిట్లను పంపుతున్నారు. ఈ కిట్లలో రెండు రాఖీలు, కుంకుమబొట్టు, పసుపు, అక్షింతలు, స్వీట్లు ఉంటాయి. సిల్వర్ కోటెడ్ ప్లేట్లతో కూడి న మంగళహారతి పళ్లాలు కూడా అందుబాటులోకి వచ్చా యి. ఇతర ప్రాం తాల్లో ఉండే సోదరుల దగ్గరికి వెళ్లలేని వారు ఇలా కిట్లు పంపడం సంప్రదాయంగా వస్తున్నది. ఈ కిట్ల ధర ప్రాంతాలను బట్టి రూ.300 నుంచి రూ.1000 వరకు ఉన్నాయి.
రాఖీలకు తగ్గిన డిమాండ్
నగరంలో రోజురోజుకు కరోనా వ్యాపిస్తుండడంతో రాఖీల విక్రయాలు తగ్గాయి. సాధారణంగా పండుగకు వారం ముందునుంచే వరంగల్ చౌరస్తా, పాత బీట్‌బజార్, బట్టలబజార్, హన్మకొండ చౌరస్తా ప్రాంతాలు హోల్‌సేల్ వ్యాపారం జోరుగా సాగేది. అయితే ఈసారి ఆ ప్రాంతాల్లో ఏమాత్రం సందడి కనిపించ లేదు. ఈ రాఖీ పండుగకు రాఖీలతో పాటు బట్టల అమ్మకాలు 50శాతం కూడా జరగలేదని వ్యాపారులు చెబుతున్నారు. సింగిల్ పీస్, స్టోన్, జరీలు, స్పాంజ్, దొరలు, మెటల్, కోల్‌కతా, పంజాబీ, కిడ్స్ రాఖీలకు ఏటా పండుగకు నెల ముందు నుంచే విపరీతంగా డిమాండ్ ఉండేదని ఈసారి మాత్రం కరోనా వల్ల అమ్మకాలు పడిపోయినట్లు రాఖీల అమ్మకందార్లు తమ బాధను వ్యక్తం చేశారు.
ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో..
ఆన్లైన్లో రాఖీలు పంపేందుకు అనేక సంస్థలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఒక్క క్లిక్‌తో తమ వారికి రాఖీలు అందుబాటులో ఉంచుతున్నారు. ఆన్‌లైన్‌లోనూ వేల సం ఖ్యలో రాఖీలు అందుబాటులోకి వచ్చాయి. వజ్రాలు పొదిగినవి, గోల్డ్ప్లేటెడ్, ముత్యాల జర్దోసి వంటి వందల రకాల్లో రాఖీలు వచ్చాయి. వీటి ధర రూ.500 నుంచి రూ.10వేల వరకు ఉన్నాయి. కొవిడ్-19 నేపథ్యంలో ఆన్లైన్ రాఖీలకు గిరాకీ ఎక్కువగా ఉంది. దూరప్రాంతాల్లో ఉన్న సోదరుల వద్దకు ప్రయాణం చేసి వెళ్లడం రిస్క్‌గా భావిస్తున్న అక్కాచెల్లెళ్లు ఈసారికి ఆన్‌లైన్‌తో సరిపెట్టుకుంటున్నారు.
పండుగ విశిష్టత..
ఏటా శ్రావణ పౌర్ణమి రోజు రక్షాబంధన్(రాఖీ) పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు. రాఖీ పండుగపై పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. అలెగ్జాండర్ చక్రవర్తితో ఆ కాలంలో జరిగిన యుద్ధం లో పురుషోత్తముడనే రాజు ఓటమి పాలవుతాడు. అతడిని బందీ చేసి తీసుకువెళుతున్న సమయంలో ఆయన భార్య రాణి సంయుక్త అలెగ్జాండర్ వద్దకు వెళ్లి చేతికి రాఖీ కడుతుంది. దీంతో సంయుక్తను చెల్లెలుగా భావించి అలెగ్జాండర్ ఏం కావాలో కోరుకోమంటే తన భర్త పురుషోత్తముడిని బం ధ విముక్తుడిని చేయాలని వేడుకుంటుంది. వెంట నే పురుషోత్తముడిని విడుదల చేసి సంయుక్తకు విలువైన కానుకలు ఇచ్చి అలెగ్జాండర్ వెళ్లిపోతాడు. దీనిని బట్టి అప్పటికే రాఖీ పండుగ ఉం దని పలువురు చెబుతారు. అలాగే దుష్టశక్తులను పారదోలడానికి యుద్ధంలో విజ యం సాధించడానికి రక్షా బంధన్ ధరించాలని శ్రీకృష్ణుడు చెప్పినట్లు కూడా ఓ కథ ప్రచారంలో ఉంది. ఏదై నా కార్యక్రమం నిర్వహించ తలపెట్టినప్పుడు రక్షను ధరించడం హైందవ ఆచా రం. ఆ కార్యక్రమం ఏ విఘ్నాలు లేకుండా సజావుగా సాగాలని, అనుక్షణం లక్ష్యం గురించి గుర్తు చేసేందుకు ఈ రక్షను ధరిస్తారు. వివాహం, యజ్ఞయాగాదు లు, వ్రతాలు, నోములు వంటి కార్యక్రమాల్లో ఈ రక్షధారణ తప్పనిసరిగా ఉం టుంది. పూర్వకాలంలో యుద్ధానికి వెళ్లే భర్తలకు భార్యలు, సోదరుల క్షేమా న్ని కాంక్షిస్తూ సోదరీమణులు రక్షలు కట్టేవారు. కాలక్రమేణా రక్షను సోదర ప్రేమకు చిహ్నంగా కట్టే విధానం వచ్చింది. ఈ రక్ష ను కట్టడంలో ముఖ్య ఉద్దే శం.వారి క్షేమాన్ని కోరడమే.
అప్రమత్తతే ముఖ్యం..
ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చింది. రోజురోజుకు ప్రజలు కరోనా బారిన పడుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అంతేగాక పండుగల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. పుట్టింటికి వెళ్లాలనుకునే ఆడపడుచులు ద్విచక్రవాహనాలు, ఆటోలు, జీపులు, కార్లు, ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. ప్రతి ఒక్కరు చిన్నా, పెద్దా అనే తేడాలేకుండా మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలి. ప్రయాణం చేసేటప్పుడు, ఇంట్లో విధిగా మాస్క్‌లు ధరించాలి. సోదరి చేతులు, కాళ్లు కడుక్కొని శానిటైజర్ చేసుకున్న తర్వాతే ఇంట్లోకి వెళ్లి సోదరుడికి రాఖీలు కట్టాలి.
తాజావార్తలు
- సెస్, సర్ ఛార్జీలను కేంద్రం రద్దు చేయాలి : మంత్రి హరీశ్ రావు
- సంక్రాంతి హిట్‌పై కన్నేసిన సోనూసూద్..?
- ఫిబ్రవరి 19న తిరుమలలో రథసప్తమి
- చిరంజీవిని చూసే అన్నీ నేర్చుకున్నా: హీరో రోహిత్
- జనం మెచ్చిన గళం గోరటి వెంకన్నది
- శెభాష్...సిరాజ్: మంత్రి కేటీఆర్
- త్వరలో కామన్ మొబిలిటీ కార్డు: హైద్రాబాదీలకు ఫుల్ జాయ్
- ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
- ఖమ్మంలో భారీగా గుట్కా, ఖైనీ ప్యాకెట్లు పట్టివేత
- 60 ట్రాక్టర్ల ఇసుక డంపును పట్టుకున్న పోలీసులు