శనివారం 08 ఆగస్టు 2020
Warangal-rural - Aug 02, 2020 , 08:45:36

పొదుపుతో ఆర్థిక సమస్యను అధిగమించొచ్చు

పొదుపుతో ఆర్థిక సమస్యను అధిగమించొచ్చు

  •  చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌
  •  త్రి చక్ర పొదుపు సంఘానికి రూ.లక్ష అందజేత

మట్టెవాడ, ఆగస్టు 1 : పొదుపు చేసుకోవడం వల్ల ఆర్థిక పరమైన సమస్యలను అధిగమించొచ్చని  రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌, వరంగల్‌ ప శ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్‌ అన్నారు. ప్రపంచ ఆటో డ్రైవర్స్‌ దినోత్సవం సందర్బంగా శనివారం వరంగల్‌ కల్పలత సూపర్‌ బజార్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం, ముఖ్యంగా సకల జనుల సమ్మె సమయంలో ఆటో డ్రైవర్ల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. 30 సంవత్సరాలుగా ఆటో డ్రైవర్లతో తనకు అనుబంధం ఉందని వారి సమస్యలు పరిష్కారానికి  తన వంతు సాయమందిస్తానన్నారు. త్రి చక్ర పొదుపు, పరపతి సహాయ సహకార సంఘానికి రూ.లక్ష అందజేస్తున్నట్లు తెలిపారు. పొదుపు చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఎదగొచ్చన్నారు. కార్యక్రమంలో సూపర్‌బజార్‌ చైర్మన్‌ వర్ధమాన్‌ జనార్దన్‌, ఎండీ జగన్మోహన్‌ రావు  త్రిచక్ర పరపతి సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. 

ముస్లింలకు శుభాకాంక్షలు..

 నయీంనగర్‌ : త్యాగం, భక్తి, విశ్వాసాన్ని చాటి చెప్పే పండుగ బక్రీద్‌ అని, ఈ కరోనా విపత్కర పరిస్థితిల్లో తగు జాగ్రత్తలు పాటిస్తూ ఇంటికే పరిమితం కావాలని చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ కోరారు. ఈ సందర్భంగా ముస్లింలకు ఆయన బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. 


logo