Warangal-rural
- Aug 02, 2020 , 08:43:55
ప్రైవేట్ దవాఖానల్లో కరోనా చికిత్సకు ఏర్పాట్లు

- ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట : పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనాకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నర్సంపేట ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్యులతో శుక్రవారం అర్ధరాత్రి సమావేశం నిర్వహించారు. నర్సంపేటలో రోజురోజుకు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పాజిటివ్ వచ్చిన వారు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగానే వైద్యం అందించాలని కోరారు. ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు ముందుకు వస్తే అనుమతి ఇస్తామని తెలిపారు. నర్సంపేటలోని పవన్ నర్సింగ్ హోం వైద్యుడు, ఐఎంఏ అధ్యక్షుడు లెక్కల విద్యాసాగర్‌రెడ్డి ముందుకురాగా, విషయాన్ని ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. శనివారం జిల్లా వైద్యాధికారి మధుసూదన్ పవన్ నర్సింగ్ హోంను పరిశీలించారు. కరోనా రోగులకు అవసరమైన ఆక్సిజన్, వెంటిలేటర్ సౌకర్యం ఉన్నట్లు గుర్తించారు.
తాజావార్తలు
- కశ్మీర్లో అల్లర్లకు పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర బహిర్గతం
- ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం : ఎస్ఈసీ
- గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన బిగ్‌బాస్ ఫేమ్ మోనాల్
- బ్యాట్‌తో అలరించిన మంత్రి ఎర్రబెల్లి..!
- క్షిపణి సాంకేతికతలో ఆత్మనిర్భరత సాధించాం: వెంకయ్య నాయుడు
- నేపాల్ ప్రధాని ఓలి నివాసం వద్ద నిరసనలు
- రైతులకు మెరుగైన ఆఫర్ ఇచ్చాం : వ్యవసాయ మంత్రి
- ఇండియన్లపై వాట్సాప్ నిర్ణయం ఏకపక్షం: కేంద్రం
- కంటి ఆరోగ్యానికి కావాల్సిన విటమిన్లు తెలుసా..?
- శ్రద్దాదాస్ సొగసు చూడతరమా
MOST READ
TRENDING