బుధవారం 05 ఆగస్టు 2020
Warangal-rural - Aug 01, 2020 , 02:04:03

జిల్లా పంచాయతీ అధికారిగా జగదీశ్వర్‌

జిల్లా పంచాయతీ అధికారిగా జగదీశ్వర్‌

  • మంచిర్యాలకు నారాయణరావు బదిలీ

వరంగల్‌ రూరల్‌, నమస్తేతెలంగాణ: జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) వీ నారాయణరావు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వీ జగదీశ్వర్‌ నియమితులయ్యారు. రాష్ట్రంలో 18 మంది డీపీవోలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. స్థాన చలనం పొందిన పద్దెనిమిది మంది డీపీవోల్లో వీ నారాయణరావు ఉన్నారు. ఇన్నాళ్లు జిల్లాలో డీపీవోగా పని చేసిన ఆయన మంచిర్యాల జిల్లా డీపీవోగా బదిలీ అయ్యారు. నారాయణరావు స్థానంలో వరంగల్‌ రూరల్‌ జిల్లా డీపీవోగా వీ జగదీశ్వర్‌ను నియమించినట్లు ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జగదీశ్వర్‌ యాదాద్రి భువనగిరి జిల్లా డీపీవోగా పని చేసి బదిలీపై ఇక్కడకు వస్తున్నారు. ఇతనిది వరంగల్‌ అర్బన్‌ జిల్లా.


logo