గురువారం 21 జనవరి 2021
Warangal-rural - Aug 01, 2020 , 02:00:21

పాడి రైతులకు రూ. 10 కోట్లు బోనస్‌

పాడి రైతులకు రూ. 10 కోట్లు బోనస్‌

  •  సాదాసీదాగా ములుకనూరు డెయిరీ మహాసభ

భీమదేవరపల్లి, జూలై 31 : ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం ములుకనూరు మహిళా సహకార డెయిరీపై పడింది. ఏటా వందలాది పాల సంఘాల అధ్యక్షులతో డెయిరీ మహాసభ జరుగుతుంది. కాగా, కరోనా వైరస్‌ కారణంగా శుక్రవారం డెయిరీ ప్రధాన కార్యాలయంలో విడుతల వారీగా 18వ వార్షిక మహాసభ సాదాసీదాగా జరిగింది. ఎలాంటి ప్రసంగాలు లేకుండా సభ్యులకు వార్షిక నివేదికలు అందజేసి సమావేశాన్ని ముగించారు. ఏటా మాదిరిగానే అత్యధికంగా పాలు పోస్తున్న సభ్యులు, సంఘాలకు  బహుమతులు ప్రదానం చేయాల్సి ఉండగా వాయిదా వేశారు. ఈ ఏడాది రూ. 125 కోట్లు వ్యాపారం జరుగగా వచ్చిన లాభంలో రూ. 10కోట్లను బోనస్‌గా సభ్యులకు ప్రకటించారు. ప్రస్తుత సంవత్సరంలో వ్యయంపై రూ. 26,75,213 ఆదాయం వచ్చినట్లు డెయిరీ వెల్లడించింది. కాగా, డెయిరీకి వచ్చిన పాల సంఘాల అధ్యక్షులు మాస్కులు ధరించారు. భౌతికదూరం  పాటిస్తూ వార్షిక నివేదికలు తీసుకెళ్లారు. డెయిరీ 18వ వార్షిక మహాసభ నివేదికను ములుకనూరు సహకార గ్రామీణ పరపతి సంఘం అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, డెయిరీ అధ్యక్షురాలు గుర్రాల విజయ, జీఎం మార్పాటి భాస్కర్‌రెడ్డి విడుదల చేశారు. 

ముగ్గురు డైరెక్టర్లు ఏకగ్రీవం.. 

డెయిరీలో మొత్తం 12 డైరెక్టర్‌ స్థానాలుండగా ఇటీవల 3,4,9 నియోజకవర్గాలకు ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. 3లో అశుపతి వీరసోమమ్మ(రత్నగిరి-2వ సంఘం), 4లో కొండం సుజాత(కందుగుల సంఘం), గుగులోతు సుజాత(వీర్లగడ్డ తండా) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

తాజావార్తలు


logo