కేసీఆర్ పథకాలు దేశానికి దిక్సూచి

- రైతు వేదికకు శంకుస్థాపనలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
నడికూడ : రైతు సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి పథకాలు దేశానికే దిక్సూచిగా మారాయని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని రాయపర్తిలో రూ.22లక్షలతో నిర్మిస్తున్న రైతువేదిక పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వేదికలు రైతులకు ఎంతగానో మేలు చేస్తాయని వివరించా రు. రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ రావుల సరిత రాజిరెడ్డి, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ బొల్లే భిక్షపతి, పంచాయతీరాజ్ శాఖ డీఈ లింగారెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ సుధాటి వెంటేశ్వరరావు, పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొజ్జం రమేశ్, జడ్పీటీసీ కొడెపాక సుమలత, ఎంపీటీసీ శ్రీలత, అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- తెలంగాణ సీఐ సృజన్‌రెడ్డికి రాష్ట్రపతి అవార్డు
- రైతన్నలకు శాల్యూట్ : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
- ఆన్ అలైన్ లో అమ్మకానికి బిడ్డ ...!
- బొలెరో వాహనం బోల్తా.. 12 మందికి గాయాలు
- బడ్జెట్ రోజున.. పార్లమెంట్ వైపు దూసుకెళ్తాం: రైతులు
- ఈ మందు టేస్ట్ సూపర్ గురూ..!
- రజినీకాంత్ 'అన్నాత్తే' రిలీజ్ డేట్ ఫిక్స్..!
- ముకేశ్‌కు బ్లాక్ మండే: ఒక్కరోజే 5.2 బిలియన్ డాలర్లు హరీ
- అప్పు కోసం పార్కు తాకట్టు పెట్టేందుకు ఇమ్రాన్ నిర్ణయం!
- ఉద్యోగుల సంఘాలతో చర్చలకు టైం ఫిక్స్