శుక్రవారం 22 జనవరి 2021
Warangal-rural - Jul 28, 2020 , 03:42:47

ఏటూరునాగారంలో ఆగస్టు 1 నుంచి లాక్‌డౌన్‌

ఏటూరునాగారంలో ఆగస్టు 1 నుంచి లాక్‌డౌన్‌

ఏటూరునాగారం, జూలై 27 : కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఏటూరునాగారంలో ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు సంపూ ర్ణ లాక్‌డౌన్‌ కొనసాగించేందుకు గ్రామస్తులు, వ్యాపారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో లాక్‌డౌన్‌పై చర్చించారు. సమావేశంలో సర్పంచ్‌ ఈసం రామ్మూర్తి, కన్నాయిగూడెం జెడ్పీటీసీ నామచందు, వ్యాపారులు అయూ బ్‌, మెరుగు సత్యం, వైస్‌ ఎంపీపీ సంజీవరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల కమిటీ అధ్యక్షుడు గడదాసు సునీల్‌ కుమార్‌, నాయకులు తుమ్మ మల్లారెడ్డి, సర్దార్‌ పాషా, బచ్చు సత్యనారాయణ, అంతటి నాగరాజు,  చిటమట రఘు, నాయకులు ఇర్సవడ్ల వెంకన్న, గుడ్ల దేవేందర్‌, పవన్‌కుమార్‌, సర్కార్‌,చంద్రబాబు, జాడి భోజారావు, బిర్యానీ రమేశ్‌, పెండ్యాల ప్రభాకర్‌, ఆలయాల కమిటీ చైర్మన్లు తాడూరి రఘు, పోగుల లక్ష్మీనారాయణ, గండపెల్లి సత్యం, కైసర్‌ పాషా పాల్గొన్నారు.

వెంకటాపురాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించాలి

వెంకటాపురం(నూగూరు) జూలై 27 : వెంకటాపురం నూగూరు మండల కేంద్రాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించాలని కోరుతూ సీపీఏం ఆధ్వర్యంలో సోమవారం మండల తహసీల్దార్‌ నాగరాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మండ లంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికా రులు ప్రత్యేక చొరవతీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వంకారాములు, గ్యానంవాసు పాల్గొన్నారు.


logo