శనివారం 16 జనవరి 2021
Warangal-rural - Jul 28, 2020 , 02:24:19

జిల్లాల అభివృద్ధికి నిధులివ్వాలి

జిల్లాల అభివృద్ధికి నిధులివ్వాలి

  • మంత్రి కేటీఆర్‌తో ఎమ్మెల్యేలు పెద్ది, ముత్తిరెడ్డి
  • సానుకూలంగా స్పందించిన అమాత్యుడు

నర్సంపేట/జనగామ: నర్సంపేట, జనగామ నియోజకవర్గ అభి వృద్ధి పనులకు నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి,  ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సోమవారం మంత్రి కేటీఆర్‌ను కోరారు. ఈ మేరకు ప్రతిపాదనలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ నియోజకవర్గంలో స్లమ్స్‌, డ్రైన్స్‌ నిర్మాణ పనుల కు రూ. 45 కోట్లు అవసరమవుతున్నవని అన్నారు. ఎకనామికల్‌ జోన్‌కు అవకాశం ఇవ్వాలని, నర్సంపేటలో భూమి అందుబాటులో ఉన్నదని తెలిపారు. ఇంటి పన్నులు పెండింగ్‌లో ఉన్నవారు తగ్గిం చాలని ప్రభుత్వానికి అభ్యర్థనలు పెట్టుకున్నారని,

వాటిని పరిశీలిం చి జోన్లను సవరించాలని కోరారు. టాక్స్‌ ఫెనాల్టీలను రద్దు చేసే దిశగా నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే ప్రతిపాద నలపై మంత్రి కేటీఆర్‌ సానుకూలంగా స్పందించారు. వారం పది రోజుల్లో ఈ అంశంపై సమావేశం నిర్వహించి స్పష్టత ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నియోజకవర్గ వ్యా ప్తంగా ఒకేరోజు 1.25లక్షల మొక్కలు నాటిన విషయాన్ని గుర్తు చే శారు. జనగామ పట్టణానికి ప్రస్తుతం ఒకవైపు వెళ్తున్న హైవే బై పాస్‌ రోడ్డుకు సమాంతరంగా మరోవైపు రింగ్‌రోడ్డును మంజూరు చేయాలని కోరారు. ఇండస్ట్రియల్‌ ప్రాంత స్థలాలను రెగ్యులరైజ్డ్‌ చేసి కొత్తగా పట్టణానికి దూరంగా ఇండస్ట్రియల్‌ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు. దీనిపై మంత్రి సా నుకూలం గా స్పందించారని ముత్తిరెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.