మంగళవారం 26 జనవరి 2021
Warangal-rural - Jul 25, 2020 , 05:41:35

మంత్రి కేటీఆర్‌ బర్త్‌డే

మంత్రి కేటీఆర్‌ బర్త్‌డే

చెన్నారావుపేట: మండలకేంద్రంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్న, ఎంపీడీవో కొర్ని చందర్‌, సొసైటీ చైర్మన్‌ ముద్దసాని సత్యనారాయణరెడ్డి మంత్రి కేటీఆర్‌ బర్త్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించి మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కుండె మల్లయ్య, మండల కోఆప్షన్‌ సభ్యులు ఎంఏ గప్ఫార్‌, మాజీ జడ్పీటీసీ జున్నుతుల రాంరెడ్డి, టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు మహ్మద్‌ రఫీ, అండ్ర రాంరెడ్డి, పర్కాల కొంరయ్య, గట్ల కృష్ణయ్య, జున్నుతుల శ్రీధర్‌రెడ్డి, చీర కుమారస్వామి, హంస భద్రయ్య, సొసైటీ కార్యదర్శి చిట్టె రవి, కార్యదర్శి బాలకిషన్‌గౌడ్‌ పాల్గొన్నారు. అలాగే, పాపయ్యపేట సర్పంచ్‌ ఉప్పరి లక్ష్మి, వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు బుర్ర సుదర్శన్‌గౌడ్‌, ఎంపీటీసీ మొగిళి రమాదేవి, కేశవరెడ్డి మొక్కలు నాటారు. సొసైటీ డైరెక్టర్‌ కంచ రాంచంద్రు, నాయకులు గుర్రం రవి, భూక్య బాలు, బర్ల యాకయ్య, అల్లంనేని వాసురావు, వీరస్వామి, బత్తిని రమేశ్‌, ఏ భాస్కర్‌ పాల్గొన్నారు.

ఖానాపురం: మండలకేంద్రంలో ఓడీసీఎంఎస్‌ చైర్మన్‌ గుగులోత్‌ రామస్వామినాయక్‌, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు మొక్కలు నాటారు. కార్యక్రమంలో సొసైటీ వైస్‌ చైర్మన్‌ దేవినేని వేణుకృష్ణ, ఉపసర్పంచ్‌ మేడిద కుమార్‌, నాయకులు తక్కల్లపెల్లి రమేశ్‌, దాసరి రమేశ్‌, వల్లపనేని కిరణ్‌, రాజు పాల్గొన్నారు.

దుగ్గొండి: కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా మండలంలోని మందపల్లి, పీజీతండా, నాచినపల్లి, శివాజినగర్‌, దుగ్గొండిలో ఎంపీపీ కాట్ల కోమల భద్రయ్య అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీవో గుంటి పల్లవి, తహసీల్దార్‌ జగన్మోహన్‌రెడ్డి, ఎస్సై రవికిరణ్‌, ఎంపీవో శ్రీధర్‌గౌడ్‌, మండలాధ్యక్షుడు రాజేశ్వర్‌రావు, రాజిరెడ్డి, శ్యామ్‌సుందర్‌రెడ్డి, ధర్మారెడ్డి, వేణు, మోహన్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు పాల్గొన్నారు. 

నర్సంపేట రూరల్‌:  గురిజాలలో సర్పంచ్‌ గొడిశాల మమత, ఉప సర్పంచ్‌ మంచిక హరీశ్‌, ఎంపీటీసీ బండారి శ్రీలత, వార్డు సభ్యులు, టీఆర్‌ఎస్‌ నేతలు మొక్కలు నాటారు. గుర్రాలగండిరాజపల్లిలో సర్పంచ్‌ తుత్తూరు కోమల రమేశ్‌ పాల్గొన్నారు.

రాయపర్తి: మండలకేంద్రంలో ఎంపీపీ జనుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మునావత్‌ నర్సింహనాయక్‌, జిల్లా నాయకుడు బిల్లా సుధీర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ ఆకుల సురేందర్‌రావు, వనజారాణి, నయీం, నర్సయ్య, హరినాథ్‌ కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. మండలంలోని ఊకల్లు, కాట్రపల్లి, మైలారం తదితర గ్రామాల్లో కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో హరినాథ్‌, యాదగిరిరెడ్డి, రాంబాబు, వెంకట్‌రెడ్డి, రంగయ్య, మధు, సాగర్‌రెడ్డి, అష్రఫ్‌పాషా, రామచంద్రారెడ్డి, గుంషావళి, రాముయాదవ్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే, మండలంలోని కొండాపురానికి చెందిన యువకులు మంత్రి కేటీఆర్‌కు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత పాఠశాల మైదానంలో హ్యాపీబర్త్‌డే టు కేటీఆర్‌ అనే ఆంగ్ల అక్షరాలను తెలంగాణ చిత్రపటంలో అలంకరించారు. అనంతరం కేక్‌కట్‌ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో యువకులు పెద్దగాని సంతోష్‌గౌడ్‌, కుమార్‌, వెంకన్న, యాకన్న పాల్గొన్నారు.  

నెక్కొండ: రాష్ట్ర పంచాయతీరాజ్‌ ట్రిబ్యునల్‌ మెంబర్‌ గటిక అజయ్‌కుమార్‌ తన స్వగృహం ఆవరణలో టీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి మొక్కలు నాటారు. ఎంపీపీ జాటోత్‌ రమేశ్‌, సొసైటీ చైర్మన్‌ మారం రాము, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య స్థానిక హైస్కూల్‌లో మొక్కలు నాటారు. అజయ్‌కుమార్‌ నిర్వహించిన కార్యక్రమంలో జడ్పీటీసీ సరోజన హరికిషన్‌, వైస్‌ ఎంపీపీ పుండరీకం, మాజీ సొసైటీ చైర్మన్‌ కొమ్మారెడ్డి రవీందర్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ వీరభద్రయ్య, సాంబయ్య, మాధవ్‌ పాల్గొన్నారు. హైస్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో ఎంఈవో రత్నమాల, హెచ్‌ఎం రంగారావు, దీక్షకుంట ఎంపీటీసీ అజయ్‌, మండల నాయకులు కట్కూరి నరేందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, వెంకన్న, రైతుబంధు సమితి జిల్లా ప్రతినిధి చెన్నకేశవరెడ్డి పాల్గొన్నారు. పెద్దకొర్పోలులో సర్పంచ్‌ మహబూబ్‌పాషా ఆధ్వర్యంలో, అలంకానిపేటలో సర్పంచ్‌ మాదాసు అనంతలక్ష్మి రవి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. 

శాయంపేట: కేటీఆర్‌ బర్త్‌డే సందర్భంగా టీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకుడు కొమ్ముల శివ మండలకేంద్రంలో వృద్ధులు, పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొత్తగట్టు సాయి, సిరికొండ యువసేన జిల్లా అధ్యక్షుడు బేరుగు రాకేశ్‌, వార్డు సభ్యులు బేరుగు సాగర్‌, బుస్స శ్రీధర్‌, గోరంటల శివ, కొమ్ముల విష్ణు, బూతాల రాజేశ్‌, రాజశేఖర్‌ పాల్గొన్నారు. అలాగే, ఆరెపల్లిలో సర్పంచ్‌ దుంపల శ్రీలత, ఉప సర్పంచ్‌ దుర్గునాల రాజు, వార్డు సభ్యుడు దుంపల మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో కార్యదర్శి మృణాళిని, నాయకులు పాల్గొన్నారు. గట్లకానిపర్తిలో సర్పంచ్‌ బొమ్మకంటి సాంబయ్య ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. సత్యం, సురేశ్‌ పాల్గొన్నారు.

గీసుగొండ: ఏనుమాముల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చింతం సదానందం గొర్రెకుంట ప్రభుత్వ పాఠశాల ఆవరణలో టీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ బాలయ్య, పీఎసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు బాబు, అశోక్‌, చిన్నస్వామి, రేణుక రవీందర్‌, శ్యామ్‌, జ్యోతి పాల్గొన్నారు. ధర్మారం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో చిన్నారులు మొక్కలు నాటారు. టీఆర్‌ఎస్‌ నాయకుడు ఎలిగేటి కిష్టయ్య పాల్గొన్నారు.

నడికూడ: నార్లాపూర్‌లో ట్రీ ఫౌండేషన్‌ యూత్‌ ఆధ్వర్యంలో జీపీ కార్యాలయం ఎదుట మొక్కలు నాటారు. టీఆర్‌ఎస్‌ నాయకులు శనిగరపు సమ్మయ్య, భోగి నాగరాజు, మాజీ ఎంపీటీసీ మచ్చ రవీందర్‌, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.


logo