కల్లాలను రైతులు వినియోగించుకోవాలి

- నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
- చలపర్తిలో కల్లం నిర్మాణానికి శంకుస్థాపన
దుగ్గొండి, జూలై 23: ప్రభుత్వం మంజూరు చేస్తున్న రైతు కల్లాలను అన్నదాతలు వినియోగించుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సూచించారు. మండలంలోని చలపర్తిలో గురువారం ఆయన గిడ్డంగి నిర్మించే ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం ఇదే గ్రామానికి చెందిన రైతు కొండ్లె రజితారమేశ్కు చెందిన వ్యవసాయ భూమిలో కల్లం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సర్పంచ్ ముదురుకోళ్ల శారద కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పెద్ది మాట్లాడారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అన్నారు. పంట దిగుబడులను ఎండబెట్టుకునేందుకు జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా మంజూరైన కల్లాలను రైతులు నిర్మించుకోవాలని సూచించా రు. అనంతరం వివిధ అనారోగ్య సమస్యలతో ప్రైవేట్ వైద్య శాలల్లో చికిత్స పొందిన పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, ఎంపీడీవో గుంటి పల్లవి, ఎంపీటీసీ రంపీస సోని రతన్, ఎంపీవో శ్రీధర్‌గౌడ్, ఏవో దయాకర్, ఈసీ రాజు, టీఏ రా జు, కార్యదర్శి సంతోష్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు, జిల్లా నాయకుడు బీరం సంజీవరెడ్డి, గొర్రె రమేశ్, కొండ్లె శ్యామ్‌సుందర్, యాదగిరి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
యువత స్వయం సమృద్ధి సాధించాలి
ఖానాపురం: యువత అవకాశాలను అందిపుచ్చుకుని స్వ యం సమృద్ధి సాధించాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలో వడ్డే వెంకటేశ్‌కు చెందిన టాటా వాటర్ డిస్ట్రిబూషన్ను పెద్ది ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, రాజశేఖర్, దా సరి రమేశ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- దళిత రైతు కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు
- చంద్రబోస్ జయంతిని జయప్రదం చేయాలి
- ‘రామమందిర నిర్మాణంలో భాగస్వాములు కావాలి’
- ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్
- గోదారమ్మ పరుగులు..!
- టీఆర్ఎస్ బలోపేతానికి సైనికుల్లా పనిచేయాలి
- కోహ్లీ, హార్దిక్ పునరాగమనం
- అంగన్వాడీలకు డ్రెస్‌కోడ్..
- అందరూ హీరోలే..
- ఆర్టీసీకి సం‘క్రాంతి’