మంగళవారం 19 జనవరి 2021
Warangal-rural - Jul 23, 2020 , 01:56:26

విద్యార్థులకు అండగా సర్కారు

విద్యార్థులకు అండగా సర్కారు

  • పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని చర్యలు
  • టీ-శాట్‌' ద్వారా ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తాం
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
  • పర్వతగిరిలో పుస్తకాల పంపిణీ
  • పాల్గొన్న ఎమ్మెల్యే అరూరి రమేశ్‌

పర్వతగిరి, జూలై 22 : విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తున్నదని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నా రు. ఎర్రబెల్లి ప్రాంగణంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి మండలంలోని పలు పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా సమయంలోనూ విద్యార్థులు చదువులో నష్టపోకుండా సీఎం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. టీ శాట్‌ ఛానల్‌ ద్వారా ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 25వ తేదీ లోపు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాల పంపిణీ పూర్తి చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందు తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బానోత్‌ సింగ్‌లాల్‌, ఎంపీపీ కమల పంతులు, సర్పంచ్‌ మాలతీ సోమేశ్వర్‌రావు, ఎంపీటీసీ మాడ్గుల రాజు, విద్యాశాఖాధికారి సత్యనారాయణరావు, హెచ్‌ఎం జలీల్‌ పాల్గొన్నారు. 

 బోయినపల్లికి  శుభాకాంక్షలు తెలిపిన మంత్రి 

రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ పుట్టిన రోజు సందర్భంగా పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బుధవారం ఆయనకు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని కోరినట్టు తెలిపారు