పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు : ఎమ్మెల్యే పెద్ది

నర్సంపేట, జూలై 19 : పేదలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుంటున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని 44 మంది లబ్ధిదారులకు రూ.15.25 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోలేని ఎంతో మంది నిర్భాగ్యులకు సీఎం రిలీఫ్‌ఫండ్ ఎంతో ఉపయోగపడుతున్నదన్నారు. తెలంగాణ ప్రభు త్వం ఏర్పడినప్పటి నుంచి పేద ప్రజల వైద్యం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నదన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను కూడా కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతున్నారన్నారు. నర్సంపేట ప్రభుత్వ దవాఖానలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించామన్నారు. బ్లడ్‌బ్యాంక్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చిందన్నారు. నర్సంపేటలో కొత్తగా సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో జిల్లా స్థాయి ఆస్పత్రి మంజూరైందన్నారు. నర్సంపేట డివిజన్‌తోపాటు మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ, గంగారం, గూడూరు ప్రాంత ప్రజలు ఈ ఆస్పత్రి సేవలు ఉపయోగించుకుంటున్నారన్నారు. కిడ్నీ డయాలసిస్ సెంటర్‌ను కూడా మంజూరు చేయించామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ జయమ్మ, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.