శనివారం 16 జనవరి 2021
Warangal-rural - Jul 19, 2020 , 02:03:24

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

  • పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

వరంగల్‌, జూలై 18 : పరకాల నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శనివారం కుడా కా ర్యాలయంలో గ్రేటర్‌, కుడా పరిధిలోని గ్రామాల్లో చేపట్టిన పనుల పురోగతిపై అర్బన్‌, రూరల్‌ జిల్లాల కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, హరిత, కమిషనర్‌ పమేలా సత్పతితో చ ర్చించారు. అంతర్గత రహదారులు, డ్రైనేజీలకు మరిన్ని నిధు లు కేటాయించాలన్నారు. మిషన్‌ భగీరథ పనుల ద్వారా రోడ్లు గుంతలమయంగా మారాయని, వెంటనే మరమ్మతులు చే యాలన్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో పార్కులను  అభివృద్ధి చేయాలని సూచించారు. ముస్త్యాలపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద  జం క్షన్‌ను అభివృద్ధి చేయాలన్నారు. సమావేశంలో కుడా ప్లానింగ్‌ అధికారి అజిత్‌రెడ్డి, ఈఈ భీమ్‌రావు, అర్బన్‌, రూరల్‌ జిల్లాల ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.