ముంబై: కరోనా కాలంలో ఎంతో మంది పేదలకు అండగా నిలిచి సాయం చేసిన రియల్ హీరో సోనూసూద్ ఇప్పుడు బ్యాండు సేవలు కూడా అందిస్తానని ముందుకొచ్చారు. ‘పెండ్లి బాజా వాయించే వారి కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే మమ్మల్ని సంప్రదించండి’ అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. కొందరు వాయిద్యకారులతో కలిసి సోనూసూద్ బ్యాండు వాయించడం దాంట్లో కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.